OTT Thriller: ఓటీటీలోకి అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ మూవీ.. డిఫరెంట్ కాన్సెప్ట్తో ట్రెండింగ్లో

OTT Thriller: ఓటీటీలోకి అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ మూవీ.. డిఫరెంట్ కాన్సెప్ట్తో ట్రెండింగ్లో

ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన లేటెస్ట్ తమిళ మూవీ ‘బాంబ్’ (Bomb). ఈ థ్రిల్లర్ డ్రామా నాలుగు వేర్వేరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో (అక్టోబర్ 10) నుంచి స్ట్రీమ్ అవుతోంది. ప్రైమ్ వీడియోతో పాటు ఆహా తమిళ్, షార్ట్ ఫ్లిక్స్, సింప్లీ సౌత్ లలో అందుబాటులో ఉంది.

ఈ మూవీలో యంగ్ హీరో అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్స్గా నటించారు. నాజర్, అభిరామి, కాళీ వెంకట్ కీలక పాత్రలు పోషించారు. విశాల్ వెంకట్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజై, ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ క్రమంలో నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చి ఆడియన్స్కి బూస్ట్ ఇస్తుంది. సినిమా కథ విషయానికి వస్తే 

కథేంటంటే:

కల్లకమ్మైపట్టి అనే గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. మణి ముత్తు (అర్జున్ దాస్), కతిరవన్ (కాళి వెంకట్) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌‌‌‌. కానీ.. వేర్వేరు వర్గాలకు చెందినవాళ్లు. కతిరవన్‌‌‌‌ నాస్తికుడు. గ్రామానికి నీరు, కరెంట్‌‌‌‌, స్కూల్‌‌‌‌లాంటి వసతులు సమకూర్చాలని కలలు కంటాడు. రెండు వర్గాలకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేస్తూ మందుకు అలవాటు పడతాడు. అతని చెల్లి (శివాత్మిక రాజశేఖర్) మణి ముత్తుని ప్రేమిస్తుంటుంది.

ఒకరోజు అనుకోకుండా కతిరవన్ చనిపోతాడు. అందరూ కలిసి శవాన్ని ఒక చెట్టు దగ్గర కుర్చీలో కూర్చోబెడతాడు. కతిరవన్ బాడీని రెడీ చేస్తున్న టైంలో అతని నుంచి అపానవాయువు సౌండ్స్‌‌‌‌ వస్తాయి. దాంతో కతిరవన్‌‌‌‌ను అందరూ దేవుడు అని నమ్మి, పూజలు చేస్తారు. రెండు వర్గాల వాళ్లు ‘మా దేవుడంటే మా దేవుడ’ని గొడవకు దిగుతారు. కానీ.. మణిముత్తు మాత్రం కతిరవన్ చనిపోలేదని బలంగా నమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా కథ.