
తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నటించిన రీసెంట్ మూవీ మదరాసి. డైరెక్టర్ మురుగదాస్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్. భారీ అంచనాల మధ్య (సెప్టెంబర్ 5న) రిలీజైన మూవీ ఆడియన్స్ను డిస్సప్పాయింట్ చేసింది. ఈ క్రమంలో నెల రోజుల్లోపే మదరాసి ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 1) నుండి ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
2 గంటల 48 నిమిషాల నిడివితో ఈ మూవీ రూపొందించబడింది. ఇందులో శివకార్తికేయన్ రఘురామ్ పాత్రలో, రుక్మిణి వసంత్ మాలతిగా నటించారు. వీరితో పాటు విద్యాత్ జమ్వాల్ (విరాట్), బిజు మీనన్ (ప్రేమ్‌నాథ్), విక్రాంత్ (సందీప్), షబీర్ కల్లరక్కల్ (చిరాగ్) వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఒక విషాదకరమైన గతం ఉన్న వ్యక్తి, ఆయుధాల పంపిణీని ఆపే ఆపరేషన్‌లో ఎలా భాగమయ్యాడనే కథాంశంతో 'మదరాసి' తెరకెక్కింది.
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ, పెట్టిన పెట్టుబడిని కూడా రాబట్టలేకపోయింది. ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.62.57 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా, వరల్డ్ వైడ్గా రూ.100 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేటర్లలో మెప్పించని ఈ యాక్షన్ థ్రిల్లర్, ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
it’s high time you watch Madharaasi now 👀#MadharaasiOnPrime, Watch Now https://t.co/dGwwRMOvYD@SriLakshmiMovie @Siva_Kartikeyan @ARMurugadoss @anirudhofficial @VidyutJammwal #BijuMenon @rukminitweets @actorshabeer @vikranth_offl @SudeepElamon pic.twitter.com/ONwKI1Sidg
— prime video IN (@PrimeVideoIN) September 30, 2025
మదరాసి కథ:
తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియా, రెండు స్పెషల్ టాస్క్ ఫోర్స్ మధ్య జరిగే కథ ఇది. ఇందులో శివకార్తీకేయన్ రఘు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇతనికొక సైకలాజికల్ ప్రాబ్లెమ్ ఉంటుంది. అదే డిల్యూషన్ సిండ్రోమ్. కొన్నిసార్లు ఈ సమస్య వల్ల చాలామందికి మంచి జరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ సందర్భంలోనే తన లైఫ్ లోకి మాలతి (రుక్మిణి వసంత్) వస్తుంది.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, తర్వాత అనుకోకుండా బ్రేకప్ అవుతుంది. ఈ బ్రేకప్ బాధలో తాను చనిపోవడానికి సిద్ధమవుతాడు రఘు.ఇదే సమయంలో ఇంకో పక్క ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్ (షబీర్), విరాట్ (విద్యుత్ జమ్వాల్) లు మొత్తం చెన్నైని గన్స్ తో నింపాలని పెద్ద ప్లాన్ చేస్తారు. ఇలా వారిని పట్టుకోవడానికి తమిళనాడు NIA హెడ్ ప్రేమ్ నాథ్ (బిజు మీనన్)కి రంగంలోకి దిగుతాడు.
ఈ క్రమంలోనే సూసైడ్‌కి సిద్ధపడ్డ రఘుని NIA ఆఫీసర్ ప్రేమ్ నాథ్ ఎలా మార్చాడు? రఘుకి ఏం చెప్పి తన మిషన్ లోకి ఎంట్రీ అయ్యేలా చేశాడు? ఈ గన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? ఇందులో విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్) పాత్ర ఏమిటి? చివరికి మాలతితో బ్రేకప్ కథ ఏమైంది? మరి ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందా? లేదా అనేది మిగతా కథ.