పదేండ్లుగా ఒకే శాఖలో పనిచేస్తున్న అధికారులు
పలువురు ఉద్యోగులు, అధికారులపై అవినీతి ఆరోపణలు
ఆరేండ్లకోసారి బదిలీలు చేపట్టాల్సి ఉన్నా..పట్టించుకోని ప్రభుత్వం
ట్రాన్స్‌ఫర్లు చేయాలనిగతంలో సీఎం రేవంత్‌ను కలిసిన సెక్రటేరియెట్‌ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌లో బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు, అధికారుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గత 10, 15 ఏండ్ల నుంచి చాలా మంది ఉద్యోగులు ఒకే శాఖలో పనిచేస్తూ పాతుకుపోయారని, వారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. బదిలీలు చేయాలని చాలా ఏండ్ల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, హెల్త్, అగ్రికల్చర్ లాంటి కీలక శాఖల్లో ఎస్‌వోల నుంచి పైస్థాయి అధికారులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోర్టు కేసులు, ట్రాన్స్‌ఫర్లు, సస్పెన్షన్లు వంటి అంశాల్లో వీళ్లపై ఆరోపణలు ఉన్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. గత పదేండ్ల పాటు సెక్రటేరియెట్‌లో అన్ని తానై నడిపించిన ఓ ఉన్నతాధికారిని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెక్రటేరియెట్ బయట పోస్టింగ్ ఇచ్చింది. సెక్రటేరియెట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులను జిల్లాలకు, హెచ్‌వోడీలకు, డైరెక్టరేట్లకు బదిలీ చేసే అవకాశం లేనందున ఒక శాఖ నుంచి మరో శాఖకు మాత్రమే మార్చాల్సి ఉంటుంది.
కొన్ని శాఖల్లో ప్రమోషన్లు వచ్చినా అదే డిపార్ట్‌మెంట్‌లో కొనసాగుతున్నారు. డిప్యూటీ, జాయింట్, అసిస్టెంట్ సెక్రటరీలు అయితే 7 ఏండ్ల నుంచి ఒకే శాఖల్లో కొనసాగుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. సెక్రటేరియెట్ రూల్స్ ప్రకారం ఆరేండ్లకు ఒకసారి కచ్చితంగా డిపార్ట్‌మెంట్ మారాల్సి ఉండగా, రెండేండ్లకొకసారైనా అదే శాఖలో సెక్షన్ అయినా మారాల్సి ఉంటుంది.
పెద్ద ఎత్తున బదిలీలు..
సెక్రటేరియెట్‌లో అన్ని శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులంతా కలిపి సుమారు 1,250 మంది ఉన్నారు. స్టెనో, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, సూపరెండెంట్, ఏఎస్‌వో, ఎస్‌వో, డిప్యూటీ, జాయింట్, అడిషనల్ సెక్రటరీ ఇలా పలు హోదాల్లో ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. మొన్నటివరకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు, రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉద్యోగులు, అధికారులు బదిలీల ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఉద్యోగులు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోగా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. కాగా, టీచర్లలో కూడా సుమారు 30 వేల మందిని బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లు కూడా ఇచ్చారు.
వివరాలు తెప్పించుకున్న సీఎస్..
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెక్రటేరియెట్ ఉద్యోగ సంఘాలు గతేడాది డిసెంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, బదిలీలు చేపట్టాలని కోరాయి. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందించి సెక్రటేరియెట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు తనకు అందచేయాలని ఆదేశించారు. ఏ ఉద్యోగి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ప్రమోషన్లు ఎప్పుడు వచ్చాయి..? వంటి వివరాలను అందజేయాలన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి సైతం ఉద్యోగుల వివరాలు అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నుంచి సేకరించారు. ఇక అప్పటి నుంచి బదిలీల అంశం ముందుకుపడటం లేదని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, సాధారణంగా జిల్లాల్లో, డైరెక్టరేట్లలో ఉద్యోగుల బదిలీ అంశంలో ఎన్నో వివాదాలు, సమస్యలు, చిక్కుముడులు ఉంటాయి. జిల్లా పోస్ట్, జోనల్, మల్టీ జోనల్, సీనియారిటీ, పోస్ట్ వేకన్సీ వంటి అంశాలను ఉద్యోగుల బదిలీ టైమ్ లో క్షుణ్నంగా పరిశీలించి బదిలీ లేదా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్రటేరియెట్‌లో ఇవేం ఉండవని అధికారులు చెబుతున్నారు.
