- గడువు ముగిసినా పట్టించుకోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న ప్రారంభించిన సమ్మర్క్యాంపులను గత నెల 31న ముగించాల్సి ఉంది. ఎన్నికల కోడ్కారణంగా అధికారులు ఈ నెల10 వరకు పొడిగించారు. గడువు ముగిసినప్పటికీ ఇంతవరకు క్లోజింగ్ సెర్మనీ నిర్వహించలేదు. సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ కోసం 55 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వీరిలో ఎంతమంది శిక్షణ పొందారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాల, బాలికల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారుచేయాల్సిన బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండేండ్లుగా సమ్మర్ క్యాంపులు సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు క్యాంపులు ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. బుధవారం నుంచి స్కూల్స్ రీఓపెన్అవుతున్నా.. సమ్మర్క్యాంపుల క్లోజింగ్ సెర్మనీ నిర్వహించకపోవడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జోనల్ కమిషనర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. క్రీడలకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా జోనల్ స్థాయిలోనే తీసుకోవాల్సి ఉంది. జోనల్ కమిషనర్లు ఫండ్స్రిలీజ్ చేయకపోవడంతో క్లోజింగ్సెర్మనీ పెండింగ్పడినట్లు సమాచారం.