Vastu tips:  ఇంట్లో డాగ్ రూం ఎక్కడ ఉండాలి.. దక్షిణం దిక్కు బాల్కనీ మూసేస్తే నష్టాలుంటాయా..!

Vastu tips:  ఇంట్లో డాగ్ రూం ఎక్కడ ఉండాలి.. దక్షిణం దిక్కు బాల్కనీ మూసేస్తే నష్టాలుంటాయా..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. చాలా మంది ఇంట్లో కుక్కలు.. పిల్లులు పెంచుకుంటారు. వాటిని ఉంచేందుకు కూడా వాస్తు పద్దతులు పాటించాలి.  ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు.. అలాగే దక్షిణం దిక్కులో బాల్కనీ మూసేస్తే నష్టాలొస్తాయా.. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న:  ఇల్లు తూర్పు ముఖంగా ఉంటుంది. ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది. మేం కొత్తగా కుక్కను కొన్నాం. కుక్క కోసం ఒక చిన్న గదిలాంటిది కట్టించాలి అనుకుంటున్నాం. ఏ వైపు కట్టిస్తే బాగుంటుంది?

జవాబు : ఇంటి ముందు కట్టాలనుకుంటే.. ఆగ్నేయం మూలకు కట్టిస్తే బాగుంటుంది.

ప్రశ్న: మేం సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం. మా ఇల్లు తూర్పు అభిముఖంగా ఉంది. అయితే.. మాకు దక్షిణం వైపు చిన్న బాల్కనీ ఉంది. అందులో నుంచి అప్పుడప్పుడు పక్షులు ఇంట్లోకి వస్తున్నాయి. ఇబ్బందిగా ఉంది. దానికి గ్రిల్ పెట్టుకోవచ్చా?

జవాబు :  కంప్లీట్ మూసేస్తే సమస్య. కానీ.. గ్రిల్ పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. లేదంటే నెట్ కట్టుకున్నా సరిపోతుంది.