‘యాంటీజెన్’ లెక్కలేవీ..

‘యాంటీజెన్’ లెక్కలేవీ..

హెల్త్ బులిటెన్లో పాజిటివ్ కేసులు యాడ్ చేస్తలేరా!
సమాచారం దాటేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: కరోనాను పసిగట్టే యాంటీజెన్ టెస్టుల లెక్కలు తేలుతలేవు. గ్రేటర్ పరిధిలో చేస్తున్న టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేయడం లేదని తెలుస్తోంది. డైలీ హెల్త్ బులిటెన్లో జీహెచ్ఎంసీ కేసులను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వారం నుంచి గ్రేటర్ పరిధిలోని పీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటివరకు 14,841 టెస్టులు చేయగా, 2,620 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13 నుంచి టెస్టుల సంఖ్య పెంచారు. ప్రస్తుతం 100 సెంటర్లలో టెస్టులు నడుస్తుండగా, మంగళవారం ఒక్కరోజే 6వేలకిపైగా టెస్టులు చేశారు. అందులో 760 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కానీ, హెల్త్ బులిటెన్లో ఇటీవల కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. వారం క్రితం వరకు గ్రేటర్ లో ఆర్టీపీసీఆర్ ద్వారానే కరోనా టెస్టులు చేశారు. అప్పట్లో డైలీ వెయ్యికిపైగా కేసులొచ్చాయి. ఇప్పడు వాటికి తోడు యాంటీజెన్ టెస్టులు చేస్తున్నా సంఖ్య తగ్గింది. దాంతో యాంటీజెన్ కేసులు బులిటెన్లో ప్రకటించడం లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారులను వివరణ కోరితే, సరైన సమాచారం ఇవ్వకుండా దాట వేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ వెబ్సైట్లో పాజిటివ్ కేసుల డీటెయిల్స్ అప్ లోడ్ చేస్తున్నారు. అందులో 40వేలు దాటినట్లు ఎంట్రీ చేశారు. అలాంటప్పుడు మిగతా కేసులు ఎటు పోయినట్లనే ప్రశ్నలు వస్తున్నాయి.

For More News..

మూడు బల్బులు, ఒక్క టీవీ.. కరెంటు బిల్లు రూ. 1.66 లక్షలు

పోలికలే కాదు.. మార్కుల్లోనూ ట్విన్స్

పురిటి నొప్పులతో.. వాగులో నడుస్తూ..