లేబర్ క్యాంపులపై ప్రభుత్వ నియంత్రణేది ? తెల్లాపూర్ ప్రశాంతతను పాడుచేసేందుకు కుట్రలు

లేబర్ క్యాంపులపై ప్రభుత్వ నియంత్రణేది ? తెల్లాపూర్ ప్రశాంతతను పాడుచేసేందుకు కుట్రలు
  • మెదక్ ఎంపీ రఘునందన్​ రావు ఫైర్

రామచంద్రాపురం, వెలుగు:  సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​లో నిర్మాణాల వద్ద ఏర్పాటు చేసిన లేబర్ క్యాంపులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని, ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షించడం లేదని మెదక్​ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. 

తెల్లాపూర్​నైబర్​హుడ్​అసోసియేషన్​ప్రెసిడెంట్ రమణపై ఒక వర్గానికి చెందినవారు సోమవారం దాడి చేయడంతో సాయంత్రం ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రమణపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 

ఓ వర్గానికి చెందిన కట్టడం విస్తరణ పేరుతో రోడ్డును ఆక్రమిస్తుంటే, వెళ్లి ప్రశ్నిస్తే పోలీసుల ముందే దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. రమణపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్​పరిణామాలకు సీఎందే బాధ్యతని హెచ్చరించారు.  

తెల్లాపూర్ లోని లేబర్​క్యాంపులకు ఎక్కడినుంచి వస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని, రోహింగ్యాలు కూడా మైగ్రేట్​అయ్యే చాన్స్ ఉందని పీసీబీ, లేబర్ ఆఫీసర్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కన్​స్ర్టక్షన్ పేరుతో డిస్ర్టక్షన్ చేస్తున్న నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.