తెలంగాణాలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది..?

తెలంగాణాలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది..?
  • బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు  కె. లక్ష్మణ్ 

మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది ఎవరు..? కేసీఆర్ కాదా..?..  ఇష్టారాజ్యంగా పాలిస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు  కె. లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణాలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది..?  54శాతం జనాభా ఉన్న బీసీలు నలుగురు మంత్రులు ఉంటే ఈటల రాజేందర్ ను తొలగించగా ముగ్గురు  మిగిలారు. 50 శాతం మంది జనాభా ఉన్న మహిళలకు మొన్నటి వరకు మంత్రివర్గంలో ప్రాధాన్యతే లేదు.. ఇప్పుడు ముగ్గురు ఇచ్చారు.. 5 శాతం మంది జనాభా ఉన్నవారికి నాలుగు మంత్రి పదవులు.. ఇదేనా సామాజిక న్యాయం అని లక్ష్మణ్ ప్రశ్నించారు. 
బీజేపీ కార్యకర్తలు సేవాభావంతో పనిచేయాలి
భారతీయ జనతా పార్టీ  ప్రతి కార్యకర్త సేవా భావంతో పని చేయాలని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు  కె. లక్ష్మణ్  పిలుపునిచ్చారు. సామాన్య పేదోడిని ప్రధానమంత్రిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులకు 38 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారని, మరో రెండు కోట్ల మందికి ఎన్ హెచ్ పి ద్వారా ఉపాధి కల్పించారని వివరించారు. బీజేపీ ఇన్ని చేస్తుంటే  తెలంగాణలో మీరేం చేశారు. ? అని ఆయన నిలదీశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెల్లెలు మారుమూల  గ్రామంలో  టీ అమ్ముతూ జీవనం సాగిస్తోందన్నారు. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి బంధువులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

 

ఇవి కూడా చదవండి

బాంబు మోతల మధ్య అండర్ గ్రౌండ్ బంకర్ లో గర్భిణి ప్రసవం

టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ