బాంబు మోతల మధ్య అండర్ గ్రౌండ్ బంకర్ లో గర్భిణి ప్రసవం

బాంబు మోతల మధ్య అండర్ గ్రౌండ్ బంకర్ లో గర్భిణి ప్రసవం

రష్యా దాడులను తిప్పికొట్టేందుకు.. చొచ్చుకుని వస్తున్న రష్యా బలగాలను నిలువరిచేందుకు ఉక్రెయిన్ సైనికులు హోరాహోరీగా తలపడుతున్నారు. రష్యా సైనికులను తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో ఉక్రెయిన్ దేశం బాంబు దాడులతో భీతిల్లుతోంది. ప్రజలు అండర్ గ్రౌండ్ లో ఉన్న మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. యుద్ధం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే చెర్నోబిల్ అణు కర్మాగారం ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్న రష్యా బలగాలు ఇవాళ మరో పది పట్టణాల్లోకి చొచ్చుకెళ్లి పట్టు సాధించాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి సైతం చొచ్చుకెళ్లాయి. దీంతో రష్యన్ బలగాలు, ఉక్రెయిన్ ఆర్మీ మధ్య బాంబు దాడులు, మిస్సైల్ల దాడులతో యుద్ధం హోరాహోరీ గా నడుస్తోంది. 
ఓ వైపు బాంబుల మోత.. మరో వైపు గర్భిణి పురిటి నొప్పులు
బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్న ఉక్రెయిన్ ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. బంకర్లో తలదాచుకుంటున్న ఓ 23 ఏళ్ల గర్భిణికి ఇవాళ పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. ఉక్రెయిన్ పోలీసులు స్పందించి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. బాంబుల మోతల మధ్య గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యుద్ధ సమయంలో పుట్టిన ఈ పసిపాపకు హోప్ (HOPE).. అనే పేరుపెట్టాలని సూచిస్తున్నారు. హోప్ అంటే ఆంగ్ల భాషలో ఆశ అనే అర్థం. పుట్టిన పాప యుద్ధానికి ముగింపు పలికి శాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే దేశంలోని చాలా మంది విదేశాలకు తరలివెళ్లారు. ఇప్పటికీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు తహతహలాడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం సుమారు 50 లక్షల మంది ఉక్రెయిన్ విడిచిపెట్టి ఇతర దేశాలకు, స్వదేశాలకు వెళ్లిపోయారని అంచనా. 

 

ఇవి కూడా చదవండి

టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది

ఉక్రెయిన్‎కు మద్దతివ్వొద్దన్నారు.. కానీ మేమిస్తాం

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ