Junior OTT: మూడు ఓటీటీల్లో శ్రీలీల రొమాంటిక్ డ్రామా ‘జూనియ‌ర్‌’.. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్ ఇవే

Junior OTT: మూడు ఓటీటీల్లో శ్రీలీల రొమాంటిక్ డ్రామా ‘జూనియ‌ర్‌’.. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్ ఇవే

కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన రీసెంట్ రొమాంటిక్ డ్రామా జూనియర్ (Junior). 2025 జులై 18న థియేటర్లలో రిలీజైన జూనియర్.. ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ మంగళవారం (సెప్టెంబర్ 30) నుంచి ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ క్రమంలోనే ఆహాతో పాటుగా మరో రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. అయితే, చెప్పపెట్టకుండా ప్రైమ్ వీడియోలోనూ మూవీ స్ట్రీమ్ అవుతూ ఆశ్చర్యపరిచింది.

సెప్టెంబర్ 24న జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఆహా ప్రకటించింది. కానీ, ప్రైమ్ అనౌన్స్ చేయకుండానే.. ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. మరోవైపు కన్నడ భాషలో నమ్మఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది జూనియర్. లేటెస్ట్గా ఆహా ఇంస్టాగ్రామ్లో జూనియర్ పోస్టర్ పోస్ట్ చేస్తూ ‘ఎమోషనల్.. ఎంటర్ టైనింగ్, ఎంగేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. 

సెప్టెంబర్ 24న జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఆహా ప్రకటించింది. కానీ, ప్రైమ్ అనౌన్స్ చేయకుండానే.. ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. మరోవైపు కన్నడ భాషలో నమ్మఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది జూనియర్. లేటెస్ట్గా ఆహా ఇంస్టాగ్రామ్లో జూనియర్ పోస్టర్ పోస్ట్ చేస్తూ ‘ఎమోషనల్.. ఎంటర్ టైనింగ్, ఎంగేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

ఇదిలా ఉంటే.. జూనియర్ మూవీ “ఫాదర్- సన్, బ్రదర్-సిస్టర్, ఫాదర్-డాటర్” అంశాలతో తెరకెక్కింది. సినిమాచూసే కొద్దీ.. స్టోరీ రోటీన్ అనిపించినప్పటికీ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ ట్రాక్ వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ను ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాయి. ఫస్టాఫ్ మొత్తం హీరో హుషారైన డాన్స్‌, హీరోయిన్తో లవ్ ట్రాక్, సత్య, హర్షతో కామెడీ వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్లో ఎమోషన్ చూపించాడు. 

దాదాపు రూ.20 కోట్లకి పైగా బడ్జెట్తో నిర్మించబడింది జూనియర్, శ్రీలీల, కిరిటీ క్రేజీ దృష్ట్యా రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 స్క్రీన్లలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్/తెలంగాణలో 500 స్క్రీన్లలో, ఇండియా వైడ్ గా 900 స్క్రీన్లలో మరియు ఓవర్సీస్లో 200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజయ్యింది. ఈ క్రమంలోనే భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. కానీ, సినిమా మిక్సెడ్ టాక్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకి పైగా గ్రాస్, ఇండియాలో రూ.7 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు సమాచారం. 

కథేంటంటే:

విజయనగరానికి చెందిన ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కోదండపాణి (రవిచంద్రన్). అతని భార్య శ్యామల. వీరిద్దరికీ 60 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు. శ్యామల తన బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో కన్నుమూస్తుంది. తల్లిలేని అభికి (కిరీటి రెడ్డి) సర్వం తానై పెంచి పెద్ద చేస్తాడు కోదండపాణి. ఈ క్రమంలో అభిపై తండ్రి కోదండపాణి వీపరీతమైన ప్రేమను చూపిస్తాడు. తన తండ్రి చూపించే ప్రేమ మూలంగా చిన్న చిన్న సరదాలు దూరమవుతున్నాయని అభి భావిస్తాడు.

‘అర‌వ‌య్యేళ్లొచ్చాక  మ‌న‌కంటూ చెప్పుకోవ‌డానికి కొన్ని జ్ఞాప‌కాలు ఉండాలి క‌దా’ అనేది అతని సిద్ధాంతం. ఈ క్రమంలో తండ్రి ప్రేమను తట్టుకోలేని అభి సిటీకి వెళ్లి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ స్ఫూర్తిని (శ్రీలీల‌) ఇష్టపడి ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. ఆ కంపెనీ CEO అయిన విజయ సౌజన్య (జెనీలియా)కు అభి అంటే పడదు.

అసలు విజయ సౌజన్యతో కిరీటికి మధ్య గొడవ ఏంటీ? విజయ సౌజన్య ఎవరు? ఆమెకు విజయనగరం అంటే ఎందుకు నచ్చదు? అలాంటి ఊరికి అభితోనే కలిసి సౌజన్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ? కోదండపాణి ఊరు నుండి సిటీ ఎందుకు రావాల్సి వచ్చింది? కిరిటీ ప్రేమించిన స్ఫూర్తి కథేంటీ? అనేది మిగతా కథ.