
మీరు స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా.. అయితే అందులో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కంటే ముందు మీ రాశిచక్రాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారం ప్రారంభించండని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. అలా చేస్తే ఆయా రంగాల్లో విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయంటున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, వ్యాపార విజయంలో రాశిచక్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఏ వ్యక్తికైనా వ్యాపారాన్ని ఎంచుకోవడం, అందులో విజయం సాధించడం అనేది అతని ప్రయత్నాలపై మాత్రమే ఆధారపడి ఉండదు. సరైన సమయంలో, సరైన దిశలో చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు విజయాన్ని సాధించడానికి కారణమవుతాయి. చాలా సార్లు ఎంత కష్టపడి ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు మీరు అందులో నష్టపోతూ ఉంటారు. అదే ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనాలను పొందే వాళ్లూ ఉన్నారు. ఇది కేవలం అదృష్ట బలంతో జరగదు. కానీ దీని వెనుక, వ్యక్తి రాశి, వ్యాపార రకం, ఆ వ్యాపారానికి సంబంధించిన గ్రహాలు వ్యక్తిని పూర్తి లాభం, విజయాలకు కారణమవుతాయి.
మేష రాశి
కుజుడు మేష రాశికి అధిపతిగా పరిగణించబడతాడు. ఈ రాశి వ్యక్తులు పోటీతత్వం గలవారై ఉంటారు. వారికి ఆర్థిక శాస్త్రంపై మంచి పరిజ్ఞానం ఉంటుంది. మేషరాశి వారు స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఫలితాలుంటాయి.
వృషభం
వృషభ రాశిచక్రం ఉన్న వ్యక్తులు జీవితంలో చాలా ఆచరణాత్మకంగా, వ్యవస్థీకృతంగా ఉంటారు. వృషభ రాశి వారు విద్యకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పాఠశాల లేదా కోచింగ్ లాంటివి ప్రారంభిస్తే, అది వారికి ఫలవంతంగా ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశిచక్రం వ్యక్తులు చాలా తెలివైనవారై ఉంటారు. వారు ఎప్పుడూ తమ పరిసరాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. మిథున రాశి వారు జర్నలిజానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం చేయవచ్చు. ఇది వారికి జీవితంలో విజయాన్ని తెచ్చిపెడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి దయగల హృదయం కలిగి ఉంటారు. ఇది నిత్యం వారి వ్యక్తిత్వాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ రాశి వారు కూడా చాలా తెలివైనవారై ఉంటారు. వీరు ఏదైనా వైద్య సంబంధిత వృత్తి ఎంపిక చేసుకోవడం మంచిది.
సింహ రాశి
సింహ రాశికి చెందిన వ్యక్తులు అత్యంత ప్రభావశీలులు. వారి స్వభావమే వారిని నాయకుడిగా చేస్తుంది. సింహ రాశి వారు రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణానికి సంబంధించిన ఏదైనా వ్యాపారాన్ని చేయవచ్చు. ప్రయాణానికి సంబంధించిన ఏదైనా వ్యాపారాన్ని కూడా చేయవచ్చు.
కన్య
కన్య రాశి వారు ఏదైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనే ప్రవర్తన కలిగి ఉంటారు. అంతే కాదు సాంకేతిక పరిజ్ఞానం కూడా కలిగి ఉంటారు. కన్య రాశి వారు ఫార్మసీకి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభిస్తే, అది వారి భవిష్యత్తుకు మంచిది.
తులా రాశి
జిమ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లేదా ఏదైనా డిజైనింగ్ సంబంధిత వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవడం తులా రాశి వారికి మంచిది. వారి సృజనాత్మక, సున్నితమైన మనస్తత్వం వ్యాపారంలో వారికి బాగా ఉపయోగపడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు. వారికి ప్రజలకు సహాయం చేయాలనే తపన ఉంటుంది. వీరు ఎన్జీవో లాంటి సోషల్ సర్వీస్ రంగాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వ్యక్తులు సానుకూలంగా మరియు ఉల్లాసంగా ఉంటారు. వారు ఫ్లైట్ అటెండెంట్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ లేదా సేల్స్ కంపెనీ వంటి వ్యాపారంలో విజయం సాధించగలరు.
మకరరాశి
మకర రాశికి చెందిన వ్యక్తులు తార్కికంగా మరియు తెలివైనవారు. టెక్నికల్ రంగంలో ప్రొఫెషనల్ ఐటీ కెరీర్ చేసేందుకు ఇదొక గొప్ప అవకాశం. ఈ రంగంలో వారికి ఉన్న అపారమైన పరిజ్ఞానం వల్ల వారి వ్యాపారం చాలా ఎత్తుకు చేరుకుంటుంది మరియు వారు ఈ వ్యాపారానికి తగిన వారనడంలో సందేహం లేదు.
కుంభ రాశి
కుంభ రాశిచక్రం గల వ్యక్తులు స్వేచ్ఛాయుతమైన, సృజనాత్మక, ఉద్వేగభరితమైన వ్యక్తులు. వీరు సంగీతం, నృత్యం లేదా డిజైన్ వ్యాపారంలో చేరవచ్చు.
మీనరాశి
మీన రాశి వారు భావోద్వేగాలకు విలువనిచ్చే వ్యక్తులు. సున్నితత్వం కలిగి ఉంటారు. కానీ వారు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని కలిగి ఉంటారు. పెయింటింగ్ లేదా డిజైనింగ్ వంటి వారి సృజనాత్మకతను ప్రదర్శించే వ్యాపారంలో చేరితే వారికి మంచిది.