ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి? మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. తినే ఆహారానికి జ్యోతిష్యానికి సంబంధం ఏమిటి.. ఏరోజు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు. గ్రహాలు ఆహారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. మొదలగు విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ప్రధానమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి ఒక వరం అని నిరూపించగల అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. ఏ రోజు ఎలాంటి ఆహార పదార్దాలు తినాలో జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహారం త్వరగా జీర్ణమైతే చాలా ఆరోగ్యం గా ఉంటారు. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు పోషకాలతో కూడి ఉండటమే కాకుండా, అనేక ప్రమాదకరమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఆదివారం : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సండే సూర్యుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ రోజు ఎలాంటి ఆహారం తిన్నా తేలికగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సండే ఫుడ్ గోధుమలు, రాగులతో తయారు చేసినవి తింటే తేలికగా జిర్ణమయి శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయి.
సోమవారం : ఈ రోజు చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అవుతాయి.
మంగళవారం : కుజుడి ప్రభావం అధికంగా ఉండే రోజు.జ్యోతిష్యం ప్రకారం కుజుడు వేడి గ్రహం. కనుక వేడి పుట్టించే మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి తింటే త్వరగా జీర్ణం అవుతాయి.
బుధవారం: బుధుడి ప్రభావం వుంటుంది. ఈ రోజున ఎలాంటి ఆహారం తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తింటే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గురువారం: గురుగ్రహ ప్రభావం వుంటుంది. గురువు ప్రశాంతను కలుగజేస్తాడు. ఈ రోజున పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తింటే చాలా ప్రశాంతంగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శుక్రవారం : ఈ రోజు శుక్రుడి ప్రభావం వుంటుంది. ఐశ్వర్యానికి సంపదకు కారకుడు. అంతేకాదు ప్రేమ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ రోజున కాస్ట్లీ ఫుడ్ బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరమని పండితులు చెబుతున్నారు.
శనివారం : ఈ రోజు శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. మన ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి.
సాధారణంగా తినే ఆహారంలో నెగెటివ్.. పాజిటివ్ శక్తులు ఉంటాయి. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నించాలి. అందుకే శ్రార్ద కర్మల సమయంలొ కొన్ని రకాల కూరలతో తయారు చేసిన వాటిని పెద్దలు నిషేధించారు.
ఇక జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే....మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకుంటూ వేగంగా జీర్ణమయ్యే పదార్దాలను తినాలి.
వైద్య సలహాలకు జ్యోతిషశాస్త్రం , నవ గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు... కాని మీ ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలు ఉన్నాయి. అందుకే .. జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

