రసవత్తరంగా మారిన భారత్, కివీస్ మూడో టీ20

 రసవత్తరంగా మారిన భారత్, కివీస్ మూడో టీ20

కివీస్, టీమిండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. రెండు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో చివరి మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా మూడో టీ20 జరగనుండటంతో ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో అని రెండు జట్ల ఫ్యాన్స్  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఓడితే అంతే..

కివీస్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా..రెండో మ్యాచ్లో అద్బుతంగా ఆడి విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 99 పరుగులే చేయగా..భారత్ కూడా లక్ష్య ఛేదనలో తడబడింది. 100 పరుగుల టార్గెట్ను అందుకునేందుకు తీవ్రంగా కష్టపడింది. సూర్యకుమార్ ఆదుకోవడంతో భారత్ గట్టెక్కింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్ కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓడితే మాత్రం టీ20లో భారత్ నెంబర్ ర్యాంకు పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు..హార్దిక్ కెప్టెన్సీలో ఓడిన తొలి టీ20 సిరీస్ అవుతుంది. 

అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటదంటే..?

అహ్మదాబాద్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటదంట. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చివరి టీ20లో అభిమానులకు ఫుల్ ఎంజాయ్ చేయనున్నారు. 

ఎవరికి ఛాన్స్..?

లాస్ట్ మ్యాచ్ లో టీమిండియాలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. చివరి మ్యాచ్ లో  పృథ్వీ షా తుది జట్టులో స్థానం దక్కించుకోవచ్చు. మూడో మ్యాచులోనూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా  గిల్, ఇషాన్ కిషన్ ను ఆడించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక స్పిన్నర్ ను పక్కన పెడతాడని తెలుస్తోంది.