మళ్లీ యాక్షన్ స్టోరీ

మళ్లీ యాక్షన్ స్టోరీ

ఓ వైపు లవ్‌‌ స్టోరీస్ చేస్తూనే, అప్పుడప్పుడు అశ్వద్ధామ, లక్ష్య లాంటి యాక్షన్‌‌ మూవీస్‌‌లోనూ నటించాడు నాగశౌర్య. ‘కృష్ణ వ్రింద విహారి’ లాంటి ప్రేమకథ తర్వాత మరోసారి యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటించబోతున్నాడు. ఈ కొత్త చిత్రాన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు. ఎస్.ఎస్.అరుణాచలం దర్శకత్వం వహించనున్నాడు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌‌పై చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్, డాక్టర్ అశోక్ కుమార్ కలిసి నిర్మించనున్నారు. నాగశౌర్య కెరీర్‌‌లో ఇది ఇరవై నాలుగో చిత్రం. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అతి త్వరలో  ఈ మూవీ ఓపెనింగ్ నిర్వహించి, ఆ తర్వాత టైటిల్ లాంచ్ చేయనున్నారు. ఇందులో నటించనుండటం పట్ల  సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేశాడు నాగశౌర్య. ఇదో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌ అని, నాగశౌర్యకు పర్ఫెక్ట్ యాప్ట్ స్క్రిప్ట్ అని చెప్పాడు దర్శకుడు. శౌర్యకు క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌‌గా ఉంటుందని, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే రివీల్ చేస్తామన్నారు నిర్మాతలు.