సాయం చేయడం మర్చిపోయి రాజకీయాలా..? : ఆది శ్రీనివాస్‌‌

సాయం చేయడం  మర్చిపోయి రాజకీయాలా..? : ఆది శ్రీనివాస్‌‌
  • కేటీఆర్‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్‌‌ ఫైర్​

వేములవాడ, వెలుగు: నర్మాల వద్ద వరద కాలువలో చిక్కుకున్న వారికి సాయం చేయడం మర్చిపోయి రాజకీయాలు చేయడమేంటని, కేటీఆర్‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్‌‌‌‌ అయ్యారు. ఇప్పటికైనా ప్రజలు ఆపత్కాలంలో ఉన్నప్పుడు బురద రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద మూలవాగులో గంగమ్మ తల్లికి  చీర కుంకుమ పసుపుతో విప్‌‌ పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గంభీరావుపేటలో వరద పరిస్థితి చూస్తుంటే పదేండ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీసం బ్రిడ్జిలు కూడానిర్మించలేకపోయారన్నారు.

ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు వస్తే సాయం చేయాల్సింది పోయి అక్కడ కూడా సీఎం రేవంత్‌‌రెడ్డిని విమర్శించాడన్నారు. తన చర్మం ఒలిచి సిరిసిల్ల ప్రజలకు చెప్పులు కుట్టిస్తానని పెద్దపెద్ద మాటలు మాట్లాడిన కేటీఆర్​.. కనీసం బ్రిడ్జిలు కూడా కట్టలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్‌‌‌‌ అన్వేష్, లీడర్లు శ్రీనివాస్​గౌడ్, కనికరపు రాకేశ్‌‌, మహేశ్‌‌, రాజు, రాంబాబు, రాజు, శ్రీనివాస్​ పాల్గొన్నారు.