బీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధితో ఉన్నాం : విప్ ఆది శ్రీనివాస్

బీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధితో ఉన్నాం :  విప్ ఆది శ్రీనివాస్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అంశంపై చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం 18న బీసీ సంఘాల బంద్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.

 ప్రభుత్వంగా అసెంబ్లీలో బీసీ బిల్లులను పాస్ చేసుకుని కేంద్రానికి పంపామని, అక్కడున్న బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. బీసీ బంద్‌‌‌‌‌‌‌‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, లీడర్లు చొప్పదండి ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, సూర దేవరాజు, గోనె ఎల్లప్ప, బొప్ప దేవయ్య పాల్గొన్నారు. 

కోడెలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

వేములవాడ, వెలుగు: -భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడెలు అని, వాటిని వ్యవసాయరంగానికి మాత్రమే ఉపయోగించుకోవాలని, ఎవరైనా కోడెలను పక్కదారి పట్టిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని విప్‌‌‌‌‌‌‌‌ ఆది శ్రీనివాస్​హెచ్చరించారు. శుక్రవారం తిప్పాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాజన్న గోశాలలో రైతులకు ఉచితంగా కోడెలు పంపిణీని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎం.హరితతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల్లో గోశాల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని, త్వరలో పనులు మొదలుపెడతామన్నారు.  

ధర్మ విజయయాత్రలో భాగంగా ఈనెల 19న శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతిస్వామి వేములవాడకు రానున్నారని, ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆది శ్రీనివాస్​అన్నారు. రాజన్న ఆలయ ఓపెన్​ స్లాబ్‌‌‌‌‌‌‌‌లో శృంగేరి పీఠాధిపతి పర్యటన ఏర్పట్లపై రాజన్న ఆలయ ఓపెన్‌‌‌‌‌‌‌‌ స్లాబ్‌‌‌‌‌‌‌‌లో సమావేశం నిర్వహించారు.  తిప్పపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోడెల పంపిణీ కార్యక్రమంను జిల్లా కలెక్టర్​ ఎం హరిత పరిశీలించారు. 

ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు వాటిని వ్యవసాయ పనులకు వినియోగించాలని సూచించారు. మొత్తం 102 జతల కోడెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, గోశాల బాధ్యులు పాల్గొన్నారు.