- రాష్ట్రంలో ఏ మొఖం పెట్టుకొని ఆందోళన చేస్తరు: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ నాయకులు ధర్నా చేస్తామంటున్నారని, వారు ఏ మొఖం పెట్టుకొని ధర్నా చేస్తామంటున్నారో చెప్పాలని విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ నేతలు ధర్నా చేయాల్సింది హైదరాబాద్ లో కాదని.. రాష్ట్రానికి నిధులు ఇవ్వని ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు.
మూడోసారి మోదీ అధికారంలోకి వచ్చి దేశానికి ఒరగబెట్టిందేంటని ఆయన ప్రశ్నించారు. డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 90 కి చేరిందని, ఇది అంతర్జాతీయంగా దేశం పరువుపోతోందని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు చిల్లర ధర్నాలు ఆపి, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
