
ముంబై: వర్ల్‌పూల్ కార్పొరేషన్ మంగళవారం 24 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మింది. ఇందుకోసం 3.4 కోట్ల షేర్లను విక్రయించింది. దాని భారతీయ యూనిట్‌ను 468 మిలియన్ డాలర్లకు అమ్మింది. ఈ విక్రయం తరువాత, పేరెంట్ కంపెనీ హోల్డింగ్ 75 శాతం నుంచి 51 శాతానికి తగ్గింది. వాటా విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వర్ల్‌పూల్ షేర్లు 4శాతం తగ్గి రూ.1,282.35 వద్ద ముగిశాయి.