అమ్మన్లో బైడెన్ శిఖరాగ్ర సమావేశం రద్దు: ప్రకటించిన వైట్హౌజ్

అమ్మన్లో బైడెన్ శిఖరాగ్ర సమావేశం రద్దు: ప్రకటించిన వైట్హౌజ్

అమ్మన్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ శిఖరాగ్ర సమావేశం రద్దయింది. జోర్డన్, ఈజిప్ట్, పాలస్తీనా అథారిటీ అధ్యక్షులతో బుధవారం (అక్టోబర్ 18) బైడెన్ సమావేశం సమావేశం కావాల్సి ఉండగా.. సమావేశం రద్దయినట్లు వైట్హౌజ్, జోర్డాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. తాజా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. అక్కడి పరిణామాలపై బైడెన్ జోర్డాన్ రాజు అబ్ధుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫ్టటా సిస్సీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షులు మహమూద్ అబ్బాస్ లతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఇజ్రాయెట్ గాజా సిటీలోని ఆస్పత్రిపై దాడి చేసి వందలాది మందిని చంపిన తర్వాత సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు జోర్డాన్ ప్రకటించింది. సమావేశం రద్దు అయినట్లు అమెరికా వైట్ హౌజ్ వర్గాలు కూడా ధృవీకరించాయి. 

Also Read :- ఇవాళ (అక్టోబర్ 18న) ఇజ్రాయెల్‌ పర్యటనకు జో బైడెన్‌