
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ వైట్ హౌస్ ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది. ‘‘కంపెనీలు హెచ్1బీ వీసాలు పొంది విదేశాల నుంచి స్కిల్డ్ వర్కర్లను తక్కువ జీతాలకు తీసుకుంటున్నాయి. అదేసమయంలో అమెరికన్లను పెద్ద ఎత్తున ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఇలా హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నందుకే ఫీజు పెంపు వంటి చర్యలను సర్కారు తీసుకున్నది” అని అందులో వివరించింది. హెచ్1బీ వీసాల దుర్వినియోగంతో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘2003 నుంచి ఇటీవలి కాలం వరకూ హెచ్1బీ వీసాలపై వచ్చిన ఐటీ వర్కర్ల సంఖ్య 32 శాతం నుంచి 65 శాతానికి పెరిగింది. అమెరికాలో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌లో 6.1 శాతం, ఇంజనీరింగ్‌లో 7.5 శాతం, బయాలజీ, హిస్టరీ గ్యాడ్యుయేట్లలో రెట్టింపు పైగా నిరుద్యోగం పెరిగింది. 2025 ఏడాదికిగాను ఒక కంపెనీ 5,189 హెచ్1బీ వీసాలు పొందింది. ఈ ఏడాది 16 వేల మంది అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసేసింది. మరో కంపెనీ 1,698 హెచ్1బీ వీసాలకు గత జులైలో అప్రూవల్ తీసుకుంది. 2,400 మంది అమెరికన్లను తొలగించింది” అని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొంది.