పెండింగ్ కేసులు పరిష్కరించాలి : ఎన్.శ్వేత

పెండింగ్ కేసులు పరిష్కరించాలి :  ఎన్.శ్వేత

సిద్దిపేట రూరల్, వెలుగు : టెక్నాలజీని ఉపయోగించి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సీపీ ఎన్. శ్వేత అధికారులకు సూచించారు. ప్రతినెలా 20 లోపు కేసుల ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు.  గురువారం సీపీ ఆఫీస్ లో సిద్దిపేట డివిజన్ పోలీస్ అధికారులతో  పెండింగ్ కేసులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పారు.  

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాల పై అవగాహన కల్పించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, ఏసీపీలు సురేందర్ రెడ్డి, రవీందర్ రాజు, చంద్రశేఖర్, ప్రసన్నకుమార్, సీఐలు కృష్ణారెడ్డి, రవికుమార్, భాను ప్రకాశ్, చేరాలు, కృష్ణ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.