
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర పవర్ సెక్టార్‌పై గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిస్థితి, బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో చేసిన అప్పులు, పవర్ ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు. గురువారంతోనే అసెంబ్లీ సమావేశాలు ముగించాలనుకున్నా.. ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది. అసెంబ్లీ షెడ్యూల్లో ఒక్క పవర్ సెక్టార్‌పై షార్ట్ డిస్కషన్ ఉంటుందని ప్రకటించింది. దీంతో శుక్రవారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశముందని తెలుస్తున్నది.