
ఆరోగ్యరంగంలో విశేష కృషి చేసిన సౌమ్య స్వామినాథన్‌కు అరుదైన అవకాశం లభించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) డిప్యూటి డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సౌమ్యస్వామినాధన్ అదే సంస్థకు ముఖ్య శాస్త్రవేత్తగా నియమితులయ్యారుడిజిటల్ హెల్త్, సృజనాత్మక మార్పులపై దృష్టిసారించేందుకుగాను ఆమెను ముఖ్య శాస్త్రవేత్తగా నియమిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇప్పటివరకూ డిడి పథకనిర్వహణ అధికారిగా ఉన్న సౌమ్య ప్రపంచ ఆరోగ్యసంస్థలో ఉన్న ముగ్గురు డిడిజిల్లో ఒకరుగా డైరెక్టర్‌జనరల్ టెడ్రాస్ అధనామ్ గెబ్రియేసస్‌కు రిపోర్టు చేస్తారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థలో ఈ విభాగాన్ని కొత్తగా సృష్టించారని, ఇదొక కొత్త విభాగమని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కొత్త డివిజన్ సంస్థకు ఐదో స్తంబంగా నిలిచిందన్నారు. ఆరోగ్య సంస్థ కొత్త డిజిటల్ హెల్త్ విభాగం ముఖ్యశాస్త్రవేత్త ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళుతుందని, డిజిటల్ టెక్నాలజీ పరంగా మరింత ముందుకు తీసుకెళుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో కీలక నిర్ణయాలు, ప్రాధాన్యతలను మరింతగా అమలుచేసేందుకు వీలుగా దేశాలను సమీకృతంచేసి పర్యవేక్షించేందుకువీలుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ ముఖ్యవిభాగం పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు.