మలేరియా వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్​వో అనుమతి

మలేరియా వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్​వో అనుమతి
  • మాస్క్విరిక్స్​ వ్యాక్సిన్​కు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్​వో
  • 3 ఆఫ్రికా దేశాల్లో ట్రయల్స్.. ఎఫికసీ 39%

న్యూఢిల్లీ: తొలి మలేరియా వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) అనుమతిచ్చింది. పిల్లల కోసం డెవలప్​చేసిన ‘ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01’ టీకాను ప్రపంచవ్యాప్తంగా వాడేందుకు అనుమతి ఇస్తున్నట్టు డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్​ జనరల్​టెడ్రోస్​ అథనమ్​ బుధవారం తెలిపారు. మూడు ఆఫ్రికా దేశాల్లో పైలెట్​గా వ్యాక్సిన్​ను పరిశీలించారన్నారు. ‘మలేరియా రీసెర్చర్​గా నేను కెరీర్​ను స్టార్ట్​ చేశాను. ఇప్పుడు ఈ భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనగడం చూస్తున్నాను’ అని అథనమ్​చెప్పారు. ​ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01 వ్యాక్సిన్​ను మాస్క్విరిక్స్​అని కూడా అంటారు. ఈ వ్యాక్సిన్​ను బ్రిటిష్​ ఫార్మాసూటికల్ కంపెనీ గ్లాక్సోస్మిత్​క్లైన్​ డెవలప్​ చేసింది.​ 2019లో మొదలైన ట్రయల్స్​లో భాగంగా ఘనా, కెన్యా, మలావి దేశాల్లోని 8 లక్షల మంది పిల్లలపై వ్యాక్సిన్​ను ప్రయోగించి చూశారు. దీని ఎఫికసీ తక్కువగానే నమోదైంది. మలేరియా కేసులను 39 శాతం, తీవ్రమైన కేసులను 29 శాతం నిలువరించగలిగింది. మలేరియా వల్ల ప్రపంచవ్యాప్తంగా 2019లో 4 లక్షల మందికి పైగా మరణించారు. ఇందులో 2.7 లక్షల మందికి పైగా పిల్లలే ఉన్నారు. గ్లోబల్​గా మలేరియా మరణాల్లో 95 శాతం 31 దేశాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా నైజీరియాలో 23 శాతం మంది ఈ రోగం బారిన పడి మరణించారు.