ఫైజర్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి

ఫైజర్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి
కరోనా నివారణ కోసం ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతిచ్చింది. అమెరికాకు చెందిన ఫైజర్ మరియు జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను వినియోగించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు వెసులుబాటు లభించింది. గతంలో బ్రిటన్ డిసెంబర్ 8న ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది. ఆ తర్వాత కెనడాతో పాటు యూరోపియన్ దేశాలు కూడా ఫైజర్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అత్యవసర వినియోగానికి పర్మిషన్ పొందిన మొదటి వ్యాక్సిన్ ఇదేనని WHO ప్రకటించింది. For More News.. హాట్​ హాట్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా, అటుకులు! కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. భవిష్యత్తులో నేను బీజేపీలో చేరుతా