
ఇనుప వస్తువులు, గాజు పెంకులు లాంటివి గుచ్చుకుని గాయాలైతే డాక్టర్లు మొదటగా ‘టెటనస్ టాక్సైడ్(TT)’ టీకా వేస్తారు. ఆ తర్వాత గాయాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేస్తారు. అయితే ఇకపై TT స్థానంలో ‘టెటనస్-డిఫ్తీరియా(TD)’ టీకా ను త్వరలో అమల్లోకి తేనుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO). తెలంగాణలో జూన్ నుంచి TD టీకాను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా దశల వారీగా కొత్త టీకాను అమలు చేయాల్సిందిగా ఇటీవల ఢిల్లీలో అన్ని రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేయడంతో.. ఆ దిశగా అమలుకు రాష్ట్ర వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి TD టీకాలు సరఫరా కానప్పటికీ.. ఈ టీకాల అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు ,నర్సులకు ముందస్తు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.