డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరం

డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరం

యూఎన్: డెల్టా కరోనా మరింత డేంజర్​గా మారుతోందని, అందులో మార్పులు జరుగుతూనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) చీఫ్​ టెడ్రోస్​ అధనోం ఘెబ్రియేసస్​ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. వ్యాక్సినేషన్​ తక్కువగా జరుగుతున్న దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కరోనా కేసులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయన్నారు. శనివారం డబ్ల్యూహెచ్​వోలో టెడ్రోస్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏ దేశమూ కరోనా ఆపద నుంచి బయటపడలేదని చెప్పారు. డెల్టాలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉండాలని, దానికి తగ్గట్టు ఆరోగ్య రంగాన్ని బలపరచుకోవాలని సూచించారు. మాస్కులు పెట్టుకోవడం, దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూనే.. మహమ్మారి కట్టడికి అవసరమైన టెస్టింగ్, ట్రేసింగ్​, ఐసోలేషన్, ఆసుపత్రుల్లో సౌలతులు మెరుగుపరుచుకోవడం వంటి చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.