గుడ్ న్యూస్..ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

గుడ్ న్యూస్..ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పారు  డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోందన్న టెడ్రోస్… ఒక్కసారి టీకా అందుబాటులోకి వచ్చాక వాటి పంపిణీ కోసం దేశాలు సహకరించుకోవాలని చెప్పారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచదేశాలు ఇప్పటికే కోవాక్స్ పేరుతో కూటమి కట్టాయి. ఈ కూటమి ఆధ్వర్యంలో 9 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే అందరి దృష్టి ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న టీకాపైనే ఉంది.

మేం పవర్‌‌లో ఉంటే చైనాను 15 నిమిషాల్లో విసిరేసేవాళ్లం

దేశంలో 67 లక్షలు దాటిన కరోనా కేసులు