
న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌తో కరోనా అంతం అవుతుందని చెప్పలేమని, మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తర్వాత వచ్చే వేరియంట్ శక్తిమంతమైనదని, స్పీడ్‌గా వ్యాపించడంతోపాటు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో కరోనా టెక్నికల్ లీడ్, ఎపిడిమియాలజిస్ట్ మరియా కెర్ఖోవె తెలిపారు. కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కన్నా పవర్‌ఫుల్‌గా ఉండే అవకాశం ఉందన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చేకొద్దీ అవి రోగనిరోధక శక్తిని తప్పించుకుని తిరుగుతాయని హెచ్చరించారు. దాని వల్ల ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. వీలైనంత వరకు వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయాలని ఆమె సూచించారు. సీజనల్ గా కరోనా సోకే ప్రమాదం కూడా పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చారు.