ఎవరీ లక్ష్మణ్​ కేవత్!.. నక్సల్స్ మకాంపై ఏప్రిల్ 5నే సమాచారం

ఎవరీ లక్ష్మణ్​ కేవత్!..   నక్సల్స్ మకాంపై ఏప్రిల్ 5నే సమాచారం

ఛత్తీస్‌గఢ్ కాంకేర్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది నక్సల్స్ హతం అయిన విషయం తెలిసిందే. దీన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద  ఎన్ కౌంటర్ గా చెప్పవచ్చు. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కాంకేర్ లో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కాంకేర్ లో మావోయిస్టుల మాకాం వేశారనే సమాచారం ఏప్రిల్  5వ తేదినే కేంద్ర హోం శాఖ కు అందింది. ఆ నక్సల్స్ గ్రిడ్ లొకేషన్ ను కేంద్ర హోం శాఖ కూంబింగ్ అధికారులకు అందజేసింది. 

బస్తర్ లో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండగా.. రెండురోజుల్లో ఆ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. దీంతో అధికారులు నక్సల్స్ ఏరవేత ఆపరేషన్ చేపట్టారు. ఎన్ కౌంటర్ కు స్పెషలిస్ట్ గా పేరున్న లక్ష్మణ్ కేవాత్ నేతృత్వం ఈ ఆపరేషన్ జరిగింది. లక్ష్మణ్ కేవాత్ కు 44 మంది మావోయిస్టులను హతమార్చిన ట్రాక్ రికార్డు ఉంది. కాగా 2024లో జరిగిన ఎన్ కౌంటర్ లలో మొత్తం 79 మంది  నక్సల్స్ చనిపోయారు. గత యేడాది డిసెంబర్ లో 70 ఎన్ కౌంటర్లలో 22 మంది  నక్స్ ల్స్ హతమయ్యారు. ఏడాది కాలంలో 394 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు భద్రతా దళాలు అధికారులు తెలిపారు. 

ఎవరీ లక్ష్మణ్​ కేవత్!

ఛత్తీస్ గఢ్​ కు చెందిన లక్ష్మణ్​ కేవత్ ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్. ఎన్ కౌంటర్  స్పెషలిస్టుగా పేరుంది. ఇప్పటి వరకు 34 కన్నా ఎక్కువ ఎన్ కౌంటర్లు చేశారు. కాంకేర్ ఆపరేషన్ మొత్తం లక్ష్మణ్ కేవత్ నేతృత్వంలోనే సాగింది. ఏడాది కాలంలో 44 మంది నక్సల్స్ చంపి రికార్డు సృష్టించాడు లక్ష్మణ్​ కేవత్.  ఈయన టీంలోని సభ్యులెవరూ చనిపోలేదని రికార్డు ఉంది.