V6 News

టైమ్స్ సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు విన్నర్ నీల్ మోహన్.. ఎవరీయన?

టైమ్స్ సీఈవో ఆఫ్ ది ఇయర్ అవార్డు విన్నర్ నీల్ మోహన్.. ఎవరీయన?

2025 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన CEO ఆఫ్ ది ఇయర్ అవార్డు  యూట్యూబ్ షార్ట్ లాంచర్, యూట్యూబ్ CEO నీల్ మోహన్ కు లభించింది.  ప్రపంచ మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూట్యూబ్‌ను నడిపిస్తూ, క్రియేటర్లకు సపోర్టివ్ గా ఉన్న నీల్ మోహన్ కు ఈ గౌరవం లభించింది. యూట్యూబ్ షార్ట్స్ లాంచింగ్ కు విశేషంగా కృషి చేసిన నీల్ మోహన్ భారతీయ సంతతి చెందిన ఇండో అమెరికన్.

1973లో నీల్ మోహన్ మిచిగాన్‌లోని ఆన్ ఆర్బర్‌లో జన్మించాడు. నీల్ మోహన్ పేరెంట్స్ తమిళనాడుకు చెందినవారు. 1980లో యూపీకి వలస వెళ్లారు. అక్కడే విద్యాభ్యాసం  పూర్తి చేసుకున్న మోహన్.. ఇద్దరు సోదరులతో కలిసి ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి  అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ , MBA పూర్తి చేశాడు మోహన్. 

నీల్ మోహన్ కెరీర్.. 

కన్సల్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన మోహన్.. డిజిటల్ అడ్వర్టైజింగ్ స్టార్టప్ నెట్ గ్రావిటీలో చేరారు. ఈ సంస్థను డబుల్ క్లిక్ కొనుగోలు చేయగా..2007లో గూగుల్ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో నీల్ మోహన్ కీరోల్ పోషించారు. 

ALSO READ : అనిల్ అంబానీ కొడుకుపై CBI కేసు : రూ.228 కోట్ల లావాదేవీలపై ఎంక్వయిరీ

నీల్ మోహన్ సంపద

యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ సంపద సుమారు 50 మిలియన్ల డాలర్లుగా ఉందని అంచనావేస్తు్న్నారు. Google/Alphabet , YouTubeలో అతని సుదీర్ఘ అనుభవం ఉన్న నీల్ మోహన్ 2023లో యూట్యూబ్ కు CEO అయ్యారు. YouTube Music, Premium , Shorts వంటి లాంచింగ్ లో కీరోల్ ప్లే చేశాడు నీల్ మోహన్.