తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టాలీవుడ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల సముదాయం. తెలుగు సినిమాలన్నీ తెలంగాణా, ఆంధ్రప్రదేష్లో రిలీజ్ అవుతూ వస్తోన్నాయి. కానీ ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్న..మేకింగ్కు  సంబంధించిన ఎక్కువ వర్క్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇందుకు ఇద్దరు ముఖ్య మంత్రులు సహకరిస్తున్నప్పటికీ..వారి వరకు ప్రతి సమాచారాన్ని తీసుకెళ్లేది మాత్రం సినిమాయోగ్రఫీ మంత్రి(Cinematography Minister) మాత్రమే. 

ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి..మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. ఇంతకు మన తెలంగాణ సినిమా మంత్రి ఎవరనేది సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారడంతో..ఇప్పుడు స్ప్రష్టత వచ్చింది. అంతకు ముందు వరుసగా రెండు సార్లు సినిమాటోగ్రఫి మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌   చేసిన విషయం తెలిసిందే  తెలిసిందే.

ఇప్పుడు ఆ బాధ్యతలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి(KomatireddyVenkatareddy)కి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanthreddy) అప్పగించడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న మినిస్టర్ ఎంతో కొంతవరకు సహకరించినప్పటికీ..ప్రస్తుతం కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ టాలీవుడ్‌ కి ఎంత మేరకు సహకారం అందిస్తుందో  చూడాలి. 

సినీ కార్మికులకు ఉన్న కష్టాలు,జూనియర్ ఆర్టిస్టులకు ఉన్న సమస్యలు, మేకింగ్ కొరకు కొత్త పర్మిషన్లు ఇలా..సంక్షేమం వంటి విషయాల్లో ఎలాంటి కొత్త నిర్ణయాలతో మంత్రిత్వ శాఖ సహకరిస్తుందేమో చూడాలి. సంక్షేమంలో భాగంగా అందరూ కోరుకుంటున్న నంది అవార్డులను కనీసం ఈ సారైనా వచ్చిన కొత్త  ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకొని ఇస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ పెద్దలు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సమానంగా అందరికీ నంది అవార్డులు ఇచ్చిన విషయం తెల్సిందే. త్వరలోనే నంది అవార్డుల విషయంలో టాలీవుడ్‌ ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చించే అవకాశాలు ఉన్నాయని సినిమా ఇండస్ట్రీ విశ్లేషకుల నుండి సమాచారం. 

అంతేకాకుండా..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక..టాలీవుడ్ లో చాలా చేంజెస్ జరిగాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. కేవలం యాక్టర్సే కాదు..సినిమాకు చెందిన అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తెలంగాణ భాష ఇప్పుడు క్రేజీగా మారింది. తెలంగాణ యాసలో మాట్లాడితే తప్ప సినిమాలు ఆడని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రాంత ఇతివృత్తాలతో తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి.