మలేరియా టీకాకు WHO ఆమోదం

మలేరియా టీకాకు WHO ఆమోదం

 మరో మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. భారత్ కు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో   ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ఈ టీకాను అభివృద్ధి చేసింది. మూడు డోసుల ఈ వ్యాక్సిన్ 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.  మొదటి టీకా కంటే ఇది మరింత సమర్థమైందని WHO చీఫ్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. 

Also Read :- న్యూస్ క్లిక్ జర్నలిస్టులపై దాడులు.. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం

మలేరియా ముప్పు ఎక్కువగా ఉన్న చిన్నారుల్లో ఈ టీకా వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు ఆమోద ముద్ర వేశామని అథనామ్ వెల్లడించారు.   వచ్చే ఏడాది నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా 2021లో జీఎస్ కే సంస్థ రూపొందించిన తొలి టీకాకు  WHO ఆమోదం తెలిపింది.ఈ టీకా కేవలం 30 శాతం మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.