ఆ దేశాలపై WHO సీరియస్

ఆ దేశాలపై WHO సీరియస్

జోహెన్నెస్​బర్గ్: కరోనా వైరస్​ తీవ్రత పెరగొచ్చని WHO హెచ్చరించిన నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలు అలర్ట్​ అయ్యాయి. వైరస్​ను ఎదుర్కోవడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏయే దేశాల్లో అధికారులు ఎలాంటి మెజర్స్ తీసుకున్నరంటే..

దక్షిణాఫ్రికా

ఆఫ్రికా సబ్​ సహారా​దేశాల్లో సౌతాఫ్రికాలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణికులను దేశంలోకి అనుమతించడంలేదు. అత్యవసరమైతే తప్ప విదేశాలకు వెళ్లొద్దని పౌరులకు సూచించింది. స్కూళ్లకు ఈస్టర్​ సెలవులు  ముందే ప్రకటించింది. వంద మందికి పైగా ఒకేచోట గుమికూడొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నైజీరియా

ఆఫ్రికాలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం నైజీరియా.. కరోనా ముప్పు నేపథ్యంలో  శుక్రవారం నుంచి 13 దేశాల సిటిజన్లను తమ దేశంలోకి అనుమతించబోమని ప్రకటించింది. ఎయిర్​పోర్ట్ లు, పోర్ట్​లతో పాటు బోర్డర్​ దాటి దేశంలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరినీ టెంపరేచర్​ పరీక్షించాకే అధికారులు లోనికి వదులుతున్నారు. హై రిస్క్​ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్​ సూచిస్తున్నారు.

కెన్యా

కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించబోమని ప్రకటించింది. కెన్యా పౌరులతో పాటు దేశంలో నివసించేందుకు పర్మిట్​ ఉన్న వాళ్లను, యూఎన్ వర్కర్లను మాత్రమే దేశంలోకి అనుమతిస్తూ, వారికి సెల్ఫ్​ క్వారెంటైన్​ లో ఉండాలని సూచిస్తోంది. స్కూళ్లు, యూనివర్సిటీలను మూసేసింది.

ఇథియోపియా

అడిస్​ అబాబా ఇంటర్నేషనల్​ ఎయిర్​ పోర్టులో డాక్టర్లను నియమించి, ప్రయాణికులను నిరంతరం పరీక్షించే ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.  పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ సిస్టంలోనే ప్రయాణించాలని సూచించింది.

రువాండా

జనం తిరిగే చోట హ్యాండ్ వాషింగ్‌ కోసం టెంపరరీ సింక్​లు ఏర్పాటు చేసింది.

ఘనా

విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు 14 రోజుల సెల్ఫ్​ క్వారెంటైన్​ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 200 పైగా కరోనా వైరస్​ కేసులు నమోదైన దేశాల నుంచి ప్రయాణికుల(ఘనా పౌరులు మినహా) ను దేశంలోకి అనుమతించడంలేదు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది