రాజస్థాన్ మ్యాచులో చెన్నై ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటే

రాజస్థాన్ మ్యాచులో చెన్నై ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరంటే

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 12వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గత మ్యాచులో ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించడంతో చెన్నై ఈ మ్యాచులో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పై విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకోవాలని సీఎస్కే పట్టుదలతో ఉంది. 

 
ఇంప్టాక్ట్ ప్లేయర్  ఎఫెక్ట్..

ఐపీఎల్ 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆటను మార్చేసింది. మ్యాచులో పరిస్థితులకు తగ్గట్లు జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించుకుంటూ లాభం పొందుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్  ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో తుషార్ దేశ్ పాండే, అంబటి రాయుడులను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకుని సఫలం అయింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచులో చెన్నై జట్టు ఎవరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోది దింపనుందే ఆసక్తి నెలకొంది. 

దీపక్ చాహర్ కు గాయం..తుది జట్టులో...

గత మ్యాచులో ఆల్ రౌండర్  దీపక్ చాహర్‌ గాయపడ్డాడు. దీంతో అతను రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచులో ఆడేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో అతని స్థానంలో తుషార్ దేశ్‌పాండేని తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది.  ఇదే జరిగితే  CSK కొత్త ఇంపాక్ట్ ప్లేయర్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

చెన్నై  మొదట బ్యాటింగ్ చేస్తే..

రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేస్తే ఆకాష్ సింగ్ లేదా ప్రశాంత్ సోలంకిలో ఎవరైనా  ఇంపాక్ట్ ప్లేయర్‌గా మారవచ్చు. ఆకాష్ సింగ్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. అతని  బౌలింగ్లో  వైవిధ్యం ఉంటుంది. అతని బౌలింగ్తో జోస్ బట్లర్,సంజు శాంసన్ వంటి వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ఒక వేళ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే లెగ్ స్పిన్నర్ ప్రశాంత్ సోలంకీని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. 23 ఏళ్ల ప్రశాంత్ సోలంకీ..గత సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 6.33 ఎకానమీతో వికెట్లు తీశాడు.

చెన్నై మొదట బౌలింగ్ చేస్తే

గత మ్యాచులో చెన్నై ఛేజింగ్ చేసినప్పుడు అంబటి రాయుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచులో చెన్నై మళ్లీ ఛేజింగ్‌ చేస్తే అంబటిరాయుడే మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్సుంది. ముంబైతో జరిగిన మ్యాచులో  రాయుడు 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు. దీంతో పాటు..అనేక సార్లు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రాయుడు ఆపద్బాంధవుడయ్యాడు. ఈ నేపథ్యంలో చెన్నై ఛేజ్ చేస్తే మాత్రం రాయుడే ఇంపాక్ట్ ప్లేయర్.