ఇవాళ సన్ రైజర్స్ తో గుజరాత్‌‌ అమీతుమీ

ఇవాళ సన్ రైజర్స్ తో గుజరాత్‌‌ అమీతుమీ

ముంబై: ఐపీఎల్–15 మొదట్లో రెండు ఓటములతో ఫ్యాన్స్​ను నిరాశకు గురి చేసిన సన్ రైజర్స్ ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలతో దూసుకెళ్తోంది. ఇదే విక్టరీ మంత్రాన్ని బుధవారం గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే మ్యాచ్ లోనూ కొనసాగించాలని చూస్తోంది. పేరుకు కొత్త టీమ్ అయినా ఏకంగా ఆరు విక్టరీలతో టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్  కూడా ఫుల్​ జోష్​లో ఉంది.  ఈ సీజన్ లో టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడగా.. అది సన్ రైజర్స్ చేతిలోనే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే మరోసారి పాండ్యాసేనను ఓడించి టాప్–4లో ప్లేస్ సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది.  ఉమ్రాన్ మాలిక్ (10 వికెట్లు), నటరాజన్ (15 వికెట్లు), భువనేశ్వర్ (9వికెట్లు), మార్కో జాన్సెన్ (6వికెట్లు) వంటి పేసర్లతో ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ లో బలంగా ఉంది. ఇక బ్యాటింగ్ లోనూ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మార్ క్రమ్ మంచి పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. మరోసారి వీరంతా రాణిస్తే ఈ మ్యాచ్ లోనూ హైదరాబాద్ గెలుపు ఖాయమే. ఇక హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గుసన్ ఆకట్టుకుంటున్నా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ఫామ్ నిరూపించుకోవాల్సి ఉంది. అలాగే ఓపెనర్లు శుభ్ మన్ గిల్, వృ-ద్ధిమాన్ సాహా దూకుడు పెంచాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నది. పాండ్యా, మిల్లర్ టచ్ లో ఉండటం టైటాన్స్ కు పెద్ద ప్లస్. ఇక ఫినిషర్ గా రాహుల్ తెవాటియా, అభినవ్​ మనోహర్ పై జట్టు ఎక్కువగానే నమ్మకం పెట్టుకుంది.  ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ రేసుకు మరింత చేరువ కావాలని గుజరాత్ కోరుకుంటోంది.