టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ కొత్త చాంపియన్ ఎవరో?

టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ కొత్త చాంపియన్ ఎవరో?
  • నేడు టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌
  • ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌‌‌‌ ఢీ
  • రా. 7.30 నుంచి స్టార్​స్పోర్ట్స్​లో..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌ మధ్య ఇప్పటివరకు 17సార్లు నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు జరిగాయి..! ఇందులో 16సార్లు ఆసీస్‌‌‌‌ గెలిచింది.. ఒక్కసారి మాత్రం కివీస్‌‌‌‌ నెగ్గినా.. అది బెస్టాఫ్‌‌‌‌ త్రీ ఫైనల్స్‌‌‌‌లో ఒక మ్యాచ్‌‌‌‌ మాత్రమే..! ఈ నేపథ్యంలో.. ఇరుజట్ల మధ్య టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు రంగం సిద్ధమైంది..! మరి ఇందులో ఎవరు గెలుస్తారు..! కంగారూలు హిస్టరీని రిపీట్‌‌‌‌ చేసి ఫస్ట్‌‌‌‌ కప్‌‌‌‌ కొడతారా..? లేక చరిత్రను తిరగరాస్తూ కివీస్‌‌‌‌.. తొలి కప్‌‌‌‌ను అందుకుంటుందా..? 14 ఏళ్ల టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ చరిత్రలో ఇంతవరకు ఈ రెండు జట్లు కప్‌‌‌‌ గెలవలేదు..! కాబట్టి ఎవరు గెలిచినా కొత్త చరిత్రే..!!

దుబాయ్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ మొత్తం ఆసక్తిగా తిలకించిన టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో లాస్ట్‌‌‌‌ పంచ్‌‌‌‌కు అంతా రెడీ అయ్యింది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌‌‌‌ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ట్రాన్స్‌‌‌‌ టాస్మేనియా రైవల్స్‌‌‌‌గా ముద్రపడిన ఈ రెండు జట్లు ఇప్పటివరకు షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో కప్‌‌‌‌ గెలవలేదు. దీంతో ఈ సారి కప్‌‌‌‌ ఎవరు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. లీగ్‌‌‌‌ దశలో ఓ మాదిరిగా ఆడినా, సెమీస్‌‌‌‌లో మాత్రం ఇరుజట్లు సూపర్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడాయి. ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌ను మట్టి కరిపిస్తూ టైటిల్‌‌‌‌ పోరుకు అర్హత సాధించాయి. అయితే సెమీస్‌‌‌‌లో రెండు జట్ల ఆట తీరును చూస్తే.. ఫేవరెట్‌‌‌‌ ఎవరనేది చెప్పడం కష్టంగా మారింది.  చివరిసారి 2015 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్లో ఈ రెండు జట్లు  తలపడగా, ఆసీస్‌‌‌‌ విజయం సాధించింది. దీంతో కనీసం ఈ ఫార్మాట్‌‌‌‌లోనైనా కంగారూలను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్‌‌‌‌ పట్టుదలతో ఉంది. మొత్తానికి పేపర్‌‌‌‌ మీద ఇరుజట్ల బలాబలాలు సమానంగా కనిపిస్తున్నా.. ఆసీస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు, కివీస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ మధ్య అసలు సిసలు సమరం జరగనుంది. 2015 తర్వాత ఐసీసీ ఈవెంట్లలో ఆసీస్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో సహజంగానే ఆ టీమ్‌‌‌‌పై గెలవాలనే ఒత్తిడి ఉంటుంది. ఇక కివీస్‌‌‌‌కు ఇది వరుసగా మూడో ఐసీసీ ఫైనల్‌‌‌‌. 

నో ఛేంజ్‌‌‌‌..
ఈ మ్యాచ్‌‌‌‌ కోసం ఆసీస్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో మార్పులు చేయడం లేదు. సెమీస్‌‌‌‌లో ఆడిన టీమ్‌‌‌‌ను యధావిధిగా దించుతోంది. దీంతో ఓపెనర్లు వార్నర్‌‌‌‌, ఫించ్‌‌‌‌ మరోసారి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో మార్ష్‌‌‌‌, స్మిత్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ భారీ హిట్టింగ్‌‌‌‌ చేయగల సమర్థులు, మార్ష్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌ రాకతో ఐదో బౌలర్‌‌‌‌ అవకాశం కూడా కలిసొచ్చింది. దీంతో వేడ్‌‌‌‌ ఏడో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌కు రానున్నాడు. మొత్తానికి ఆసీస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ డీప్‌‌‌‌గా ఉండటంతో కివీస్‌‌‌‌ బౌలర్లు శక్తికి మించి శ్రమించాలి. బౌలింగ్‌‌‌‌లో హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. స్టార్క్‌‌‌‌, కమిన్స్‌‌‌‌ గాడిలో పడితే తిరుగుండదు. ఏకైక స్పిన్నర్‌‌‌‌గా జంపా చెలరేగితే కివీస్‌‌‌‌కు కష్టాలు తప్పవు. 

ఒక్క మార్పుతో..
న్యూజిలాండ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఒక్క మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. చేయి గాయంతో డేవన్‌‌‌‌ కాన్వే అందుబాటులో లేడు. దీంతో అతని ప్లేస్‌‌‌‌లో సీఫర్ట్‌‌‌‌ను తీసుకునే చాన్స్‌‌‌‌ ఉంది. మిగతా టీమ్‌‌‌‌లో పెద్దగా మార్పులు లేవు. గప్టిల్‌‌‌‌, మిచెల్‌‌‌‌.. ఆసీస్‌‌‌‌ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటే శుభారంభం దక్కినట్లే. మిడిలార్డర్‌‌‌‌లో విలియమ్సన్‌‌‌‌, సీఫర్ట్‌‌‌‌, ఫిలిప్స్‌‌‌‌పై భారం పడనుంది. ఈ త్రయం జంపా, స్టోయినిస్‌‌‌‌, మార్ష్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఐదుగురు ఫుల్‌‌‌‌టైమ్‌‌‌‌ బౌలర్లు అందుబాటులో ఉండటంతో నీషమ్‌‌‌‌ ఆరో ప్లేస్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు రానున్నాడు. బౌలింగ్‌‌‌‌లో బౌల్ట్‌‌‌‌ది కీలక పాత్ర. సాంట్నెర్‌‌‌‌, సౌథీ, మిల్నే అండగా నిలిస్తే చాలు. స్పిన్నర్‌‌‌‌గా ఇష్‌‌‌‌ సోధీ రాణించాల్సిన అవసరం చాలా ఉంది. 

జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా: ఫించ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), వార్నర్‌‌‌‌, మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌, స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌, వేడ్‌‌‌‌, కమిన్స్‌‌‌‌, స్టార్క్‌‌‌‌, జంపా, హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌. 
న్యూజిలాండ్‌‌‌‌: విలియమ్సన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), గప్టిల్‌‌‌‌, డారెల్‌‌‌‌ మిచెల్‌‌‌‌, సీఫెర్ట్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌, నీషమ్‌‌‌‌, సాంట్నెర్‌‌‌‌, సౌథీ, ఆడమ్‌‌‌‌ మిల్నే, ట్రెంట్‌‌‌‌ బౌల్ట్‌‌‌‌, ఇష్‌‌‌‌ సోధీ.

పిచ్‌‌‌‌, వాతావరణం
ఈ మ్యాచ్‌‌‌‌ కోసం కొత్త పిచ్‌‌‌‌ను రెడీ చేశారు. మంచు గురించి పెద్ద ఆందోళన లేదు. కానీ టాస్‌‌‌‌ గెలిస్తే రెండు జట్లు ఛేజింగ్‌‌‌‌ వైపే మొగ్గు చూపే చాన్స్‌‌‌‌ ఉంది.