రాష్ట్రమంతటా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే చర్చ

రాష్ట్రమంతటా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే చర్చ
  • బీజేపీ టీఆర్​ఎస్​ నువ్వా నేనా
  • అందరి చూపూ అటువైపే
  • 30న పోలింగ్.. నవంబర్ 2న రిజల్ట్
  • టీఆర్ఎస్ భారమంతా మంత్రి హరీశ్​ పైనే
  • గెలుపుపై ధీమాతో ఈటల రాజేందర్​
  • బీజేపీ తరఫున ఊరూరా తిరిగిన కీలక నేతలు
  • అన్నింటా వెనుకబడ్డ కాంగ్రెస్
  • హుజూరాబాద్​ ప్రచారం నేటితో బంద్​

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ప్రచారం క్లైమాక్స్​కు చేరింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రచార పర్వం బుధవారం సాయంత్రానికి ముగియనుంది. ఈనెల 30న ఉప ఎన్నిక పోలింగ్‌‌ జరగనుంది. నవంబర్ 2న ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ప్రచార వ్యూహాన్ని నడిపించారు. ఇక ఆత్మగౌరవ నినాదంతో పోటీలో నిలిచిన ఈటల రాజేందర్.. గెలుపుపై ధీమాతో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా బీజేపీ కీలక నేతలంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రమంతటా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే చర్చ నడుస్తోంది.

ఐదున్నర నెలలుగా..
ఈ ఏడాది మే నెలలో మంత్రివర్గం నుంచి తొలగించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల బయటికి వచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ప్రజాక్షేత్రంలోకి దిగారు. అప్పటి నుంచే హుజూరాబాద్‌‌లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఐదున్నర నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్‌‌ విడుదలయ్యాక ప్రచారంలో మరింత వేగం పెంచాయి. తనను ధిక్కరించి, బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీకి దిగడంతో ఈ ఎన్నిక కేసీఆర్‌‌‌‌కు సవాలుగా మారింది. టీఆర్​ఎస్​ నుంచి గెల్లు శ్రీనివాస్‌‌ను బరిలో దింపారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక నేతగా ఉండి.. బయటికి వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 160 రోజులకు పైగా ప్రజల మధ్యే ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. ఆయన తరఫున కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డితో పాటు మరో నలుగురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రచారం చేశారు. బీజేపీ స్టేట్‌‌చీఫ్‌‌ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చుగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రాజాసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీలు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, విజయశాంతి సహా ముఖ్య నేతలంతా ప్రచారం చేస్తున్నారు. ఈటల తరఫున పార్టీతో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలు ప్రచారం చేస్తున్నారు. తనకు అత్యంత సన్నిహితులతో పాటు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీడిన తర్వాత తనతో కలిసి వచ్చిన వారితో ఓటర్లకు చేరువయ్యేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీటుగా ప్రతి ఓటరును చేరుకోవడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

కాంగ్రెస్.. చాలా వెనుక..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడింది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించిన పార్టీ.. ఎన్నికల నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రచారంలో స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచింది. పార్టీ రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మణిక్కం ఠాగూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి సహా ముఖ్య నేతలు తమ అభ్యర్థి బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే సాగుతోంది. మరోవైపు బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు సోషల్ మీడియా కేంద్రంగానూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. ఈటలకు ప్రజల్లో కొంత సానుభూతి ఉండటంతో దానిని తగ్గించడానికి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాను టీఆర్ఎస్ ఉపయోగించుకుంటోంది. దీన్ని బీజేపీ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా టీం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినా.. సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా కేంద్రంగా సాగే ప్రచారం పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎఫెక్ట్‌‌ చూపే చాన్స్‌‌ ఉంది. 

పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు
నియోజకవర్గంలో మొత్తం 305 పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లలో ఏర్పాట్లు  చివరి దశకు వచ్చాయి. కరోనా దృష్ట్యా పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌ను ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పెంచారు. గతంలో ఇది సాయంత్రం 5 గంటలకే ముగిసేది. ఓటరు స్లిప్పుల పంపిణీ, ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సర్వే కూడా వేగంగా జరుగుతోంది. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 2.36 లక్షలకుపైగా ఓటర్లుండగా.. అందులో 7,500 మంది మరణించారని తెలిసింది.

ఎలాగైనా గెలవాలని కేసీఆర్..
హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని కేసీఆర్‌‌ టార్గెట్‌‌గా పెట్టుకున్నారు. ఆయన నేరుగా ప్రచారంలోకి దిగకున్నా.. టీఆర్ఎస్ పార్టీ ఇన్‌‌చార్జ్‌‌గా ఉన్న మంత్రి హరీశ్‌‌రావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో నిత్యం మాట్లాడుతూ.. ఎక్కడెక్కడ ఏమేం చేయాలో సూచిస్తున్నారు. ప్రజల నాడిని వివిధ సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్‌‌ నివేదికల ఆధారంగా బేరీజు వేసుకుంటూ ఆయా వర్గాలను మచ్చిక చేసుకునే చర్యలు వివరిస్తున్నారు. బూత్‌‌ల వారీగా ప్రతి 50 మందికి ఒక ఇన్‌‌చార్జిని నియమించి ఓటర్లందరినీ కలిసి పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నారు. వారి మంచిచెడులు సంబంధిత ఇన్‌‌చార్జ్‌‌లే చూసుకోవాలని ఆదేశించారు. ఆయా కులాలు, వివిధ సంఘాల ముఖ్య నేతలను రంగంలోకి దించి వారి ద్వారా పార్టీకి ఓట్లేయించేలా ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన కొన్ని కులాలపై ఫోకస్‌‌ పెట్టారు. 

చెప్పును నిలబెట్టినా గెలుస్తుందన్న కేసీఆర్​ అహంకారాన్ని అణచాలె
తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేశారు. కానీ కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతోంది. కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నడు. ఆయన అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య ఉప ఎన్నిక జరుగుతోంది. ‘నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది’ అనే కేసీఆర్ అహంకారాన్ని హుజూరాబాద్ ప్రజలు అణచివేయాలి. 
- బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్

కుట్రలు, నోట్ల కట్టలు
హుజూరాబాద్ ప్రజలు ఏ పార్టీలో ఉండాల్నో, ఎవరికి ఓటెయ్యాల్నో టీఆర్ఎస్ లీడర్లే శాసిస్తున్నరు. నోట్ల కట్టలు, కుట్రలు, కుతంత్రాలతో దౌర్జన్యం చేస్తున్నరు. టీఆర్ఎస్​కు ఓటెయ్యకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తమని, పర్మినెంట్ ఉద్యోగులను ట్రాన్స్​ఫర్ చేస్తామని బెదిరిస్తున్నరు. నేనుండగా పింఛన్లు, రేషన్ కార్డులు, చేనేత కార్మికుల హక్కులు, దళితబంధు, ఇతర పథకాలేవీ ఆగనివ్వను. 
- బీజేపీ నేత ఈటల రాజేందర్

ఈటలను అసెంబ్లీకి పంపుదాం 
రాజేందర్‌‌ను అసెంబ్లీకి పంపితే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులొస్తయ్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను భారీ మెజారిటీతో గెలిపించాలి.
రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా హుజూరాబాద్‌లో ఈటల డెవలప్​మెంట్​ చేసిండు. ఆయన రాజీనామా చేయకుంటే కేసీఆర్​ ఇటువైపు కూడా చూసే వారు కాదు. 
- వివేక్ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు

ఎగిరేది గులాబీ జెండానే
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మాదే. రైతుల కరెంట్ కష్టాలు పోగొట్టినం. ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు పారిస్తున్నం. తెలంగాణలో రెండు పంటలు పండేలా కేసీఆర్ చేసిండు. ఆరు సార్లు ఈటలకు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేయకుండా తనకు అన్యాయం జరిగిందని నాటకమాడు తున్నడు. ఉప ఎన్నికలో ఎగిరేది గులాబీ జెండానే.
- మంత్రి హరీశ్ రావు

మనోడిని గెలిపించుకుందాం
ఉద్యమం టైమ్ లో జైలుకు వెళ్లిన వ్యక్తి.. మన కుల బాంధవుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు.. నక్సల్ సిద్ధాంతాలు అని  చెప్పే ఈటల రాజేందర్ మతతత్వ పార్టీలోకి ఎట్ల పోయిండు. ఈటలను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదు. ఆయనే తెచ్చుకున్న ఎలక్షన్లు ఇవి. ఈటల పేదబిడ్డ అయితే ఎనిమిదెకరాల ఇల్లు ఉంటదా?
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కేసీఆర్ ​డబ్బునే నమ్ముకున్నడు
హుజూరాబాద్​లో కేసీఆర్ ​డబ్బునే నమ్ముకున్నడు. కంటైనర్ల కొద్దీ డబ్బు తెచ్చి టీఆర్​ఎస్​ నేతలు జనాన్ని ప్రలోభపెడుతున్నరు.  కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రజల్లోకి వెళ్తున్నామంటున్న కేసీఆర్, అదే విషయాన్ని చినజీయర్​స్వామి మీద ఒట్టేసి చెప్పగలరా? చదువుకున్న యువతకు ఉద్యోగాలిస్తలే కానీ ఊరూరా అందరినీ తాగుడుకు బానిసలను చేస్తున్నరు.
- కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క