తగ్గిన టోకు ధరలు

తగ్గిన టోకు ధరలు

న్యూఢిల్లీ : టోకు ధరల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 0.20 శాతానికి తగ్గింది.  జనవరి నెలలో ఇది 0.27 శాతంగా ఉంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రతికూల జోన్‌‌‌‌‌‌‌‌లో ఉంది.  నవంబర్‌‌‌‌‌‌‌‌లో 0.26 శాతం వద్ద సానుకూలంగా మారింది. గత ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 3.85 శాతంగా ఉంది.  ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 6.85 శాతం నుంచి ఫిబ్రవరిలో 6.95 శాతానికి స్వల్పంగా పెరిగింది.

కూరగాయల ద్రవ్యోల్బణం జనవరిలో 19.71 నుంచి 19.78 శాతంగా ఉంది. పప్పుధాన్యాలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం జనవరిలో 16.06 శాతంతో పోలిస్తే ఫిబ్రవరిలో 18.48 శాతంగా ఉంది. తయారీ, ఉత్పత్తుల ధరలు కూడా జనవరిలో 1.13 శాతంతో పోలిస్తే 1.27 శాతం తగ్గాయి.