దళితులకు రెండు సీట్లు కేటాయించడం హర్షణీయం

దళితులకు రెండు సీట్లు కేటాయించడం హర్షణీయం

జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి, నాగర్​కర్నూల్ ఎంపీ స్థానాలను దళితులకు కేటాయించడం హర్షణీయమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్​గాంధీకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బంజారాహిల్స్​లోని సంఘం ఆఫీసులో చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. మాలలు మొదటి నుంచి కాంగ్రెస్​పార్టీ వెన్నెంటే ఉన్నారని, కాంగ్రెస్​దళిత, బలహీన వర్గాల పార్టీ అని అభివర్ణించారు. 

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు హామీలను అమలు చేసిందని, దళిత, బలహీన వర్గాలకు16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకుందని చెప్పారు. మందకృష్ణ మాదిగ బీజేపీకి సపోర్టు చేస్తూ..   కాంగ్రెస్​పార్టీని ఎంపీ సీట్లు అడగడం ఏమిటని చెన్నయ్య ప్రశ్నించారు. సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్​చైర్మన్లు బూరుగుల  వెంకటేశ్వర్లు, గోపూజ రమేశ్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాలూకా రాజేశ్, గ్రేటర్​అధ్యక్షుడు బండ్ల శ్రీనివాస్, గోకుల్​కల్యాణ్​తదితరులు పాల్గొన్నారు.