సర్వే తర్వాతే ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు పంపిణీ : రుద్రూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం

సర్వే తర్వాతే ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు పంపిణీ  : రుద్రూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం

వర్ని, వెలుగు :   బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు పునరావృతం కాకుండా సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించిన తర్వాతే డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు పంపిణీ చేస్తామని రుద్రూర్ ​గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. మంగళవారం పంచాయతీ ఆఫీస్​లో సర్పంచ్​ సునీత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్​ మాట్లాడుతూ గ్రామ సభ నిర్వహించి అర్హులను గుర్తిస్తామన్నారు.  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, జహీరాబాద్‌‌‌‌ ఎంపీ సురేష్‌‌‌‌ షెట్కార్‌‌‌‌ సమక్షంలో  ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి ప్రేమ్‌‌‌‌ దాస్, ఉప సర్పంచ్​నిస్సర్,  వార్డు సభ్యులు పాల్గొన్నారు.