ఫామ్ లో ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే

ఫామ్ లో ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లే

ప్రస్తుతం పేలవ ఫామ్ తో నిరాశ పరుస్తున్న టీంఇండియా మాజీ కెప్టెన్  విరాట్ కోహ్లీ తన కెరీర్లోనే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు.  దీంతో కోహ్లీ పైన మాజీ ప్లేయర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన అశ్విన్ ను పక్కన పెట్టినప్పుడు ఎంతోకాలం నుంచి విఫలమవుతున్న కోహ్లీని జట్టు నుంచి ఎందుకు తప్పించకూడదని మాజీ  ఆటగాడు కపిల్ దేవ్ ప్రశ్నించాడు. " కోహ్లీ టీ20లో ఎంతోకాలం నుంచి విఫలం అవుతున్నాడు .. అతడ్ని బెంచ్ కు పరిమితం చేయక ఎందుకు కొనసాగిస్తున్నారు. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోతే వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. ఈ విషయంపై సెలెక్షన్‌ కమిటీ ఆలోచించాలి " అని కపిల్ దేవ్ అన్నాడు.  కాగా కోహ్లీ సెంచరీ చేసి  దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో కూడా కోహ్లీ  ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన కోహ్లీ , రెండో ఇన్నింగ్స్ లో 20 రన్స్ మాత్రమే చేసి అభిమానులను నిరాశపర్చాడు.