కొత్త సెంటిమెంటా : నాలుగు నెలలుగా కేసీఆర్ ఫాంహౌస్ ఎందుకు వెళ్లటం లేదు..?

కొత్త సెంటిమెంటా : నాలుగు నెలలుగా కేసీఆర్ ఫాంహౌస్ ఎందుకు వెళ్లటం లేదు..?

కొంతమందికి పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది. మరికొందరి ఊర్లో ఇంటి మీద ప్రేమ ఉంటుంది. ఇట్లా రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి. అయితే ఓ పెద్ద లీడర్ కి అందరికీ తెలిసిన పెద్ద సెంటిమెంట్ ఉంది. రకరకాల కారణాలతో ఆ సెంటిమెంట్ కి దూరమైన ఆయన ఎక్కువగానే బెంగపెట్టుకున్నారట. ఆయన బాధ తెలిసినవాళ్లు సెంటిమెంట్ ఫాలో కావడమే బెటరని చెబుతున్నారట.

 సీఎం కేసీఆర్ మామూలుగానే నెలలో 20 రోజులు ఫాం హౌస్ లోనే ఉంటారని టాక్. ఈసారి మాత్రం కొన్ని నెలలుగా ఫాం హౌస్ దిక్కు పోలేదట. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట. దీనికంటే ముందు నుంచి కూడా ఫాంహౌస్ కు పోలేదట ముఖ్యమంత్రి. తెలంగాణ రాకముందు..వచ్చినంగా ఆయన ఫాం హౌస్ లోనే ఎక్కువగా ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఎర్రవల్లి ఫాంహౌస్ లోనే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారని అందరికీ తెలుసు. కేసీఆర్.. ఫాం హౌస్ కు ఎందుకు పోవడం లేదన్న చర్చ బాగానే జరుగుతోందట.

ఫస్ట్ టర్మ్ కేసీఆర్ పాలనలో ఎక్కువ భాగం ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ప్రగతిభవన్ కట్టిన తర్వాత కూడా అక్కడి నుంచే పాలన వ్యవహారాలు ఎక్కువగా నడిపించారు. కొత్త సెక్రటేరియట్ కట్టిన తర్వాత ఫాం హౌస్ కు రాకపోకలు బంద్ అయ్యాయట. ఫాం హౌస్ సీఎం అని విమర్శలు రావడంతో అటువైపు వెళ్లడమే మానేశారట. వెళ్లినా గంటో అరగంటో ఫాంహౌస్ లో ఉండి వెనక్కి వచ్చేస్తున్నారట. గత నాలుగు నెలల నుంచి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వైపే వెళ్లలేదట. ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చనీయాంశంగా మారిందట.

ఏమాత్రం విశ్రాంతి కావాలనుకున్నా కచ్చితంగా ఫాం హౌస్ కు వెళ్లేవారట. కానీ మూడు వారాలుగా జ్వరంతో బాధపడుతున్న.. ఫాంహౌజ్ మొహం మాత్రం చూడలేదట. పోవాలని ఉన్నా పోతాలేరట. సారుకు ఫామ్ హౌస్ రంది పట్టుకుందని గులాబీ లీడర్లు మాట్లాడుకుంటున్నారట.  2014 ,18 అసెంబ్లీ ఎన్నికలు, వీటికితోడు పార్లమెంట్ ఎలక్షన్స్, ఉపఎన్నికలు అన్నిటికీ అక్కడి నుంచే సీఎం కేసీఆర్ స్కెచ్ వేసేవారు. ఈ సారి మాత్రం అన్ని ప్రగతి భవన్ నుంచే నడిపిస్తున్నారట ముఖ్యమంత్రి.

ALSO READ : గులాబీ సెంటిమెంట్.. డిసెంబర్ కలిసొస్తుందని ప్రచారం