భవిష్యత్ లో నేపాల్ దేశం ఉంటుందా..! ఇంత పెద్ద భూకంపానికి కారణాలు ఏంటీ.. ?

భవిష్యత్ లో నేపాల్ దేశం ఉంటుందా..! ఇంత పెద్ద భూకంపానికి కారణాలు ఏంటీ.. ?

రీసెంట్ గా ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, నేపాల్‌లోని బీరేంద్రనగర్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ NCR భూకంప ప్రకంపనలతో దెబ్బతిన్నది. ఇటీవలి కాలంలో ఢిల్లీలో భూకంపాలు గతంలో కంటే చాలా ఎక్కువయ్యాయి. అయితే ఈ ప్రాంతం తరచుగా భూకంపాలకు ఎందుకు గురవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా?

సాధారణంగా భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపం వస్తుంది. ఈ పలకలు క్రస్ట్ అని పిలువబడే భూమి పై పొర లోపల ఉంటాయి. భూమి ఉపరితలంలోని రెండు బ్లాక్‌లు ఒకదానికొకటి కదులుతున్నప్పుడు, అది క్రమంగా భూకంపానికి కారణమవుతుంది. భూకంపం భూమి క్రస్ట్ లోపల ఉన్న ఫోకస్ నుంచి ఉద్భవిస్తుంది.  

Also Read :- నేపాల్లోని భారతీయుల కోసం ఈ నెంబర్ కు కాల్ చేయండి

హిమాలయాలు ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య భారతదేశం మధ్య ఉన్నాయి. భారతదేశం- నేపాల్ లోని ఈ భాగం రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో (ఫాల్ట్ జోన్లు) ఉంచబడినందున ఈ ప్రాంతాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. రెండు ప్లేట్లు ఢీకొనడం వల్ల తరచూ ఈ రెండు దేశాలు భూకంపాలకు గురవుతున్నాయి. భారత ప్రభుత్వం ప్రకారం, భారతదేశంలోని దాదాపు 59% భూభాగం (భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తుంది) వివిధ తీవ్రతల దృష్ట్యా భూకంపాలకు గురవుతుంది.

భారతదేశ భూకంప జోన్ మ్యాప్ ప్రకారం, మొత్తం వైశాల్యం నాలుగు భూకంప మండలాలుగా వర్గీకరించబడింది. జోన్ V భూకంపపరంగా అత్యంత చురుకైన ప్రాంతం, జోన్ II అతి తక్కువ. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జోన్ 5లో ఉన్నాయి. ఇక్కడ అత్యధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఢిల్లీ-NCR ప్రాంతం జోన్ IVలో ఉంది.

జోన్ల వారిగా భూకంప తీవ్రత

జోన్ V: 11%
జోన్ IV: 18%
జోన్ III: 30%
జోన్ II: 41%