అలీ ఖమేనీ అంత్యక్రియలకు 4 నెలలు ఎందుకు ఆగారు.. ఇన్నాళ్లు ఆయన భౌతికకాయాన్ని ఎక్కడ ఉంచారు..?

అలీ ఖమేనీ అంత్యక్రియలకు 4 నెలలు ఎందుకు ఆగారు.. ఇన్నాళ్లు ఆయన భౌతికకాయాన్ని ఎక్కడ ఉంచారు..?

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం(జూలై3, 2026) ప్రారంభమయ్యాయి. ఖమేనీ చనిపోయిన 4 నెలల తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియలు నిర్వహిస్తోంది. అంత్యక్రియల్లో భాగంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి వచ్చే శుక్రవారం (జూలై9) ఖమేనీ భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. భారత్, చైనా, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 100 కుపైగా దేశాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అయితే ఖమేనీ చనిపోయిన 4 నెలలు అంత్యక్రియలు నిర్వహించకుండా ఎందుకు ఆగారు..? ఇన్నాళ్లు ఆయన భౌతిక కాయాన్ని ఎక్కడ దాచారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

సాధారణంగా ఇస్లామిక్ ఆచారాలు ఆలస్యం లేకుండా జరుగుతాయి. అయితే ఖమేనీ అంత్యక్రియల్లో నాలుగు నెలల ఆలస్యం వెనక అనేక ఊహాగానాలకు దారితీసింది. అలీ ఖమేనీ మృతదేహాన్ని తాత్కాలికంగా ఖననం చేశారని పుకార్లు కూడా వచ్చాయి.  అయితే ఇరాన్ ఈ వాదనలు ఖండించింది. నెలల తరబడి జరిగిన  ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యద్దం కారణంగానే వాయిదా పడిందని ఇరాన్ ప్రకటించింది.

►ALSO READ | లోయలో పడిన బస్సు నుజ్జు నుజ్జు.. : మొత్తం 40 మంది ప్రయాణికులు మృతి

ఖమేనీ అంత్య క్రియలు నాలుగునెలల తర్వాత జరగడానికి  చాలా కారణాలున్నాయి.యుద్ద పరిస్థితులు, భద్రతపరమైన సమస్యలు, మతపరమైన అంశాలు, రాజకీయ కారణాలతో  ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఖమేనీ యుద్దం ప్రారంభమైనరోజే చనిపోవడం దాదాపు నాలుగు నెలలుయుద్దం కొనసాగడంతో కొంత సమయం తీసుకున్నారు. దేశవిదేశాలనుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్ల కోసం కూడా ఖమేనీ అంతిమ ఘట్టం ఆలస్యం అయింది. యుద్దం కారణంగా మతపరమైన కార్యక్రమాలు చేయడం సాధ్యం కాకపోవడంతో ఖమేనీ అంతిమ కారక్రమం వాయిదా పడిందని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరి ఇంతకాలం ఖమేనీ భౌతిక కాయాన్ని ఎక్కడ దాచారు..ఎలా భద్ర పరిచారనేది మరో సందేహం. కుళ్లిపోకుండా ఉండేందుకు సాధారణంగా రసాయనాలు పూసి ఎంబాల్మింగ్ చేస్తారు. అయితే ఎంబాల్మింగ్ చేయకుండా నాలుగు నెలల పాటు ఖమేనీ భౌతికకాయాన్ని డీప్ ఫ్రిజ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాలుగు నెలల ఆలస్యానికి యుద్ధ పరిస్థితులు, భద్రతా సవాళ్లు, భారీస్థాయి అంత్యక్రియల ఏర్పాట్లేనని ఇరాన్ అధికారికంగా వెల్లడించింది.