వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకు?.కేంద్రానికి సుప్రీం ప్రశ్న

వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకు?.కేంద్రానికి సుప్రీం ప్రశ్న

వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు.  కోవిడ్ పై సుమోటోగా నమోదైన కేసును విచారించింది సుప్రీం కోర్టు. కేంద్రం తీసుకున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించారు సొలిసిటర్ జనరల్. ఈ సందర్బంగా .. వ్యాక్సిన్ తయరీకి ఎంత ఖర్చు చేశారని  ప్రశ్నించింది సుప్రీం. సీరం, భారత్ బయోటెక్ కంపెనీలకు ఎంత చెల్లించారని ప్రశ్నించింది. కోవిడ్ నియంత్రణ ఆంక్షలు,చర్యలపై వివరణ కోరింది. ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరా వివరాలు అఫిడవిట్ లో లేవని తెలిపింది. నిరక్షరాస్యులు వ్యాక్సినేషన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకుంటారని ప్రశ్నించింది.  వంద శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించింది.  వ్యాక్సిన్ ఉత్పత్తిలో కేంద్రం పెట్టుబడి వివరాలివ్వాలని కోరింది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీపై విధానం లేదా అంటూ ప్రశ్నించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపువారు ఎంతమంది ఉన్నారో అఫిడవిట్ లో తెలపాలని చెప్పింది. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కొరతపై వాస్తవాలను దాచొద్దని ఆదేశించింది. వాస్తవాలను దాచిపెడితే కోర్టు ధిక్కరణ కింది పరిగణిస్తామని చెప్పింది.