Health Tip : తినే పండ్లపై ఉప్పు ఎందుకు వేస్తారు.. మంచిదా కాదా..!

Health Tip : తినే పండ్లపై ఉప్పు ఎందుకు వేస్తారు.. మంచిదా కాదా..!

చాలామంది తినేముందు పండ్లమీద ఉప్పు చల్లుకుంటారు. అదేమంటే చాలా టేస్ట్ ఉంటుందని అంటారు. ముఖ్యంగా జామకాయ కోసిన తర్వాత ఉప్పుకారం కలిపిన పౌడర్ చల్లుకుంటారు. పచ్చిమామి డికాయ ముక్కల మీద కూడా ఉప్పు చల్లుకుని సూపర్ అని తింటారు. కొందరైతే రుచికోసం పుచ్చకాయ ముక్కల మీద కూడా ఉప్పు చల్లుకుంటారు. ఉప్పు చల్లుకుని పండ్లను తినడం మంచిదా కాదా? అని ఆలోచిస్తే.. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం ఎవరికైనా మంచిది కాదు.

కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే బీపి కూడా పెరుగుతుంది. షుగర్ తో బాధపడే వాళ్లు పండ్లపై ఉప్పు చల్లుకోవడం అసలు మంచిదికాదు. కానీ పండ్ల మీద ఉప్పు చల్లుకుని తినడం వల్ల ఉపయోగాలూ ఉన్నాయి.

పండ్ల మీద కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. ఉప్పు చల్లడం వల్ల ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే పుల్ల మామిడికాయలు, నిమ్మకాయలు, జామ కాయలు లాంటి వాటిలో సిట్రజన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు" వస్తాయి. ఉప్పు వీటిని సులభంగా జీర్ణం చేస్తుంది. అంటే గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తకుండా చేస్తుందన్నమాట. జామకాయపై చల్లుకునే ఉప్పు పళ్లను మరింత శుభ్రం చేస్తుంది.