చూడటానికి లగ్జరీగా ఉండే స్ప్లిట్ ఏసీ, ఇల్లు మారేటప్పుడు మాత్రం దాదాపు రూ.5వేల వరకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టిస్తుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇల్లు మారే వారికి ఇది లగ్జరీ కాదు, ఒక పెద్ద తలనోప్పి. మెకానిక్ కోసం వెతకడం, గ్యాస్ రిఫీల్ చేయడం, కొత్త పైపుల కోసం డబ్బులు ఖర్చు చేయడం వంటివి మీ సేవింగ్స్ డబ్బుని హరించివేస్తాయి. అందుకే ఇప్పుడు తెలివైన వారు మళ్లీ విండో ఏసీల వైపు మారుతున్నారు.
విండో ఏసీ తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు:
*విండో ఏసీని తీయడం, మరోచోటుకి తీసుకెళ్లడం చాలా ఈజీ. దీనికి పెద్దగా టెక్నీషియన్లు లేదా కొత్త రాగి పైపుల అవసరం ఉండదు. ఇంకా తక్కువ ఖర్చు తక్కువ.
*చాలా అద్దె ఇళ్లలో విండో ఏసీ కోసం ప్రత్యేకంగా స్థలం ఉంటుంది. దీనివల్ల గోడలకు రంధ్రాలు చేయాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా ఓనర్లతో డిపాజిట్ విషయంలో గొడవలు రావు.
*స్ప్లిట్ ఏసీలాగ అమర్చడానికి గంటల కొద్దీ సమయం పట్టదు. కిటికీలో పెట్టామా, ప్లగ్ పెట్టామా, చల్లదనం పొందామా అన్నట్లు ఉంటుంది.
*విండో ఏసీ అనేది ఒకే యూనిట్ కాబట్టి, పదే పదే ఇళ్లు మారినా పాడయ్యే అవకాశం తక్కువ, రిపేర్ ఖర్చులు, మెయింటెనెన్స్ కూడా తక్కువ..
*ఇప్పటి విండో ఏసీలు పాతవాటిలా పెద్దగా సౌండ్ చేయవు. ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తున్న ఇవి చాలా తక్కువ శబ్దంతో, స్ప్లిట్ ఏసీలాగే పని చేస్తున్నాయి.
►ALSO READ | RBI ఎగబడి కొంటున్న బంగారం.. జనం మాత్రం ఎందుకు కొనకూడదు..? ఎందుకీ కన్ఫ్యూజన్
మీరు కొత్త విండో ఏసీ కొనేటప్పుడు.. కరెంట్ బిల్లుతో పాటు, ఎన్ని ఇళ్లు మారినా గట్టిగా ఉండాలంటే గుర్తుంచుకోవాల్సినవి...
*సాధారణ ఏసీల్లా కాకుండా ఇవి అవసరాన్ని బట్టి వేగాన్ని తగ్గించుకుంటాయి. దీనివల్ల కరెంట్ బిల్లులో 35% వరకు ఆదా అవుతుంది ఇంకా అనవసర సౌండ్స్ రావు.
*2024 నాటి 5-స్టార్ రేటింగ్, 2026లో 3-స్టార్‌తో సమానం కావచ్చు. కాబట్టి కొనేటప్పుడు లేటెస్ట్ BEE స్టార్ రేటింగ్, కనీసం 3.5 ISEER వాల్యూ ఉండేలా చూసుకోండి.
*విండో ఏసీ గది లోపలే ఉంటుంది కాబట్టి, తక్కువ శబ్దం ఉండాలి. 48dB కంటే తక్కువ శబ్దం చేసే మోడల్స్‌ను తీసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
* తరచుగా ఏసీని ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం వల్ల తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గ్యాస్ లీక్ కాకుండా ఉండాలంటే 100% రాగి కాయిల్స్ ఉన్న ఏసీనే కొనండి.
*వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకునేలా (145V–290V) ఉన్న ఏసీని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల స్టెబిలైజర్ కోసం పెట్టే రూ.2,500 ఆదా అవుతుంది.
