రాహుల్.. మీరు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదు?

రాహుల్.. మీరు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదు?

న్యూఢిల్లీ: ప్రధాని మోడీతో పాటు కేంద్రంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తరచూ విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయనను టార్గెట్ చేసింది. కరోనా వ్యాక్సిన్ మీద మోడీని నిలదీస్తున్న రాహుల్.. ఇప్పటివరకు ఎందుకు టీకా తీసుకోలేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

'భారత్ లో కరోనా టీకాల నిల్వలు బాగానే ఉన్నాయి. మనకు వచ్చిన ఇబ్బందేం లేదు. కానీ రాహుల్ కు తనను ఎవరూ పట్టించకోవడం లేదనే బాధ ఉన్నట్లుంది. ఆయన ఇప్పటివరకు టీకా ఎందుకు వేయించుకోలేదు? దీన్ని ఏమనాలి? రాహుల్ కు టీకా వేయించుకోవడం ఇష్టం లేదా? లేదా ఆయన ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారా?' అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్వశ్చన్ చేశారు.