
‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుట్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారింది. యంగ్ హీరోలు మొదలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల వరకూ ఎటు చూసినా శ్రీలీలనే కనిపిస్తోంది. దాదాపు పది చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో చాలా బిజీగా ముందుకు సాగుతోంది. అయితే ఇన్ని సినిమాలకు డేట్‌లు అడ్జస్ట్ చేయలేకపోతోందట శ్రీలీల.
దీనికోసం ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను కూడా వదులుకుందని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రంలో శ్రీలీలను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ సెట్స్‌పై ఉంది. కానీ చేతినిండా ప్రాజెక్టులతో శ్రీలీల ఈ సినిమా షూట్‌లో జాయిన్ కాలేకపోతుందట. దీంతో ఆమె స్వయంగా బయటికొచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే ‘ధమాకా’తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, శ్రీలీల కాంబో మరోసారి రిపీట్ చేయాలనుకున్నారు. దీన్ని నుంచి కూడా ఆమె తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. వీటిపై తన నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతమైతే.. శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి.